సోమవారం భారత్ బంద్

babai babai

అమరావతి : రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడుతున్న వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. కాంగ్రె స్ పార్టీ తో సహా పలు ప్రతి పక్ష పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇందుకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని టి.కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతివ్వాలని వివిధ పార్టీలను విజ్ఞప్తి చేశాయి. ఇక ఏపీ రాష్ట్రంలో వామపక్షాలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బంద్‌కు మద్దతు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి.

Comments

comments