ఇండియా టీం కోచ్ విషయంలో మరో ట్విస్ట్..! జహీర్ ఖాన్ ను తీసేసి ఎవర్ని పెట్టారో తెలుసా..?

మొత్తం మీద భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇటీవలే హైడ్రామా నడుమ కోచ్ ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్య కోచ్ పదవికోసం తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, క్రెకెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరబ్ గంగూలికి రవిశాస్త్రి ఎంపిక అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. గతంలో కోచ్ పదవి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడం సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. మరి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడం సీఏసీ సభ్యుడు సౌరబ్ గంగూలీకి ఇష్టం లేదని అన్నారు. కాకపోతే జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా పెడితే రవి శాస్త్రి కి కోచ్ పదవి ఇవ్వడం ఓకే అన్నాడు.

బాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ ఉన్నాడు. కానీ బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం రవి శాస్త్రి జహీర్ ఖాన్ పేరు చెప్పలేదు. “భరత్ అరుణ్” పేరుని ప్రస్తావించాడు. ఫైనల్ గా రవి శాస్త్రి మాటపైన బీసీసీఐ నించుంది. జహీర్ ఖాన్ ను తీసేసి…”భరత్ అరుణ్” ను బౌలింగ్ కోచ్ గా నియమించింది. 2019 వరల్డ్ కప్ ముగిసేవరకు బౌలింగ్ కోచ్ గా భారత్ అరుణ్ ఉంటారు.

source: times of india

Comments

comments

Share this post

scroll to top