భ‌ర‌త్ అనే నేను లో తొల‌గించిన సీన్..! ఇది సినిమాలో ఉండుంటే…పెద్ద వివాద‌మే అయ్యిండేది.!?

భ‌ర‌త్ అనే నేను హిట్ టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారిస్తుంది. పొలిటిక‌ల్ క‌థాంశంతో తీసిన ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో జీవించాడు మ‌హేష్ బాబు .అయితే రెండు రోజుల నుండి సోష‌ల్ మీడియాలో భ‌ర‌త్ అనే నేను సినిమా నుండి ఎడిటింగ్ లో తొల‌గించ‌బ‌డిన నాలుగు వీడియోస్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్రైవేట్ స్కూల్స్ భాగోతం, బ‌డ్జెట్, వ్య‌వ‌సాయం, గ‌ర్భావ‌తి మ‌హిళ‌….ఈ నాలుగు అంశాల‌ను సంబంధించిన వీడియోలో….మొద‌టి మూడు సంద‌ర్భాల సీన్ లు సూప‌ర్ ఉన్నాయి..కానీ నాల్గ‌వ సీన్ సినిమాలో ఉండుంటే మాత్రం పెద్ద వివాదానికి కేంద్ర బిందువు అయ్యేది ఈ సినిమా.!

Bharat Ane Nenu Pregnant Woman Uncut Scene: 

గ్రామ‌స్తుల‌ స‌మ‌స్య‌లను విన‌డానికి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన భ‌ర‌త్…ఓ గ‌ర్భావ‌తి మ‌హిళ‌ను చూసి…ఎంతమంద‌మ్మా పిల్ల‌లు? అని అడుగుతాడు…దానికామె ముగ్గురండీ…ఇది నాల్గ‌వ‌ది అని త‌న గ‌ర్భాన్ని చూపిస్తుంది. దానికి రియాక్టైన సిఎం..అంత‌మందిని పోషించి, చ‌దివించే స్తోమ‌త ఉందా..? అని అడిగి….మ‌గాడికి లేదు మీక‌న్నా ఉండొద్దు బుద్ది అని అక్క‌డి నుండి వెళ్ళిపోతాడు…ఒక‌వేళ ఈ సీన్ సినిమాలో ఉండి ఉండుంటే…పెద్ద వివాదానికి కేంద్ర బిందువు అయ్యిండేది.! ఇప్ప‌టికే కామెంట్స్ రూపంలో చాలా మంది తమ అస‌హానాన్ని వెల్ల‌గ‌క్కుతూనే ఉన్నారు.!

 

Bharat Ane Nenu  Uncut Scenes :  CLICK HERE

Comments

comments

Share this post

scroll to top