భానుప్రియ జీవితంలో ఊహించని విషాదం.. ! ఆ షాకింగ్ న్యూస్ వినగానే భానుప్రియ అమెరికాకు వెళ్లిపోయారు.!

ప్రముఖ నటి భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నారు. కొంత కాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. ఈ షాకింగ్ న్యూస్ వినగానే భానుప్రియ అమెరికాకు వెళ్లిపోయారు. భానుప్రియ, ఆదర్శ్‌ల వివాహం 1998లో అమెరికాలో జరిగింది. వీరికి అభినయ అనే కూతురు ఉంది. 2005లో వీరిద్దరూ విడిపోయారు. దీంతో భానుప్రియ తన కూతురు అభినయతో కలిసి చెన్నైకు తిరిగి వచ్చేశారువృత్తిపరంగా ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్. 1998, జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలో భానుప్రియను ఆయన వివాహం చేసుకున్నారు. అక్కడి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఆదర్శ్ కౌశల్-భానుప్రియల దాంపత్యానికి గుర్తుగా 2003లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇద్దరూ కళా రంగాలకు చెందినవారే కావడం.. కళారంగం పట్ల అమితమైన అభిమానం ఉండటంతో కుమార్తెకు ‘అభినయ’ అని పేరు పెట్టుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత ఆదర్శ్ కౌశల్-భానుప్రియల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఆ తర్వాత రెండేళ్లకే 2005లో భానుప్రియ ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. భర్తతో విడాకుల అనంతరం భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. అప్పటినుంచి కుమార్తెతో పాటు చెన్నైలోనే ఉంటూ.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అడపాదడపా తెలుగు సినిమాల్లోనూ కనిపించారు. అలాగే కూచిపూడి, భరతనాట్యం వంటి కళానృత్యాల్లో చాలామందికి శిక్షణ ఇస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top