వైద్యాన్ని వ్యాపారం చేసిన ఇప్పటి డాక్టర్లు ఎక్కడా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిస్వార్థ సేవ చేస్తున్నఈ డాక్టర్ ఎక్కడ!?

ఈమె పేరు: భక్తియాదవ్… వృత్తి:  వైద్యురాలు.. ఎప్పటి నుండి: 1948 నుండి ( అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి)… ప్రత్యేకత ఏంటి?: ఇమెకిప్పుడు 91 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా డాక్టర్ గా  వైద్యసేవలు అందిస్తూనే ఉంది అది కూడా ఫ్రీగా…  ఆశ్చర్యంగా ఉంది కదూ….! చేతికి చిన్న గాయం అయినా సర్జరీ పేరుతో అటు ఇటు తిప్పుతూ  లక్షల్లో బిల్ లేసే హాస్పిటల్స్ ఉన్న ప్రస్తుత తరుణంలో( ఇటీవల హైద్రాబాద్లో ఓ పిల్లాడికి జరిగింది)..ఫ్రీగా వైద్యం చేయడం, అది కూడా 91 సంవత్సరాల వయస్సులో….. అంతే కొంతమంది కారణజన్ములుంటారు.. పరులకు సేవ చేయడమే పరమావధిగా ఫీలు అవుతారు. మానవసేవే మాధవసేవ అని తలచే వాళ్లు..అలాంటి వారి కోవలోకి చెందిదే ఈ భామ్మ భక్తియాదవ్.

ఈమె దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుండి వైద్యురాలిగా కొనసాగుతోంది భక్తి యాదవ్. 68 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న భక్తి యాదవ్ భారతదేశంలో మొదటి మహిళా ఎంబిబిఎస్ వైద్యురాలిగా రికార్డు సృష్టించారు. 91 ఏళ్ళ  వయసులో ఉన్న భక్తి యాదవ్, కొన్ని వేలమందికి పురుడుపోసింది. చాలామంది గర్భిణులకు నార్మల్ డెలివరినే చేస్తుంది. మహారాష్ట్రలోని ఇండోర్ గత కొన్నేళ్ళుగా డాక్టర్ గా కొనసాగుతున్న భక్తియాదవ్, ఈ వయసులోనూ  హాస్పిటల్ కు వచ్చి వైద్యం చేస్తున్నారు.

dr.-yadav

అయితే వయసు సహకరించకపోవడంతో మరీ ఎక్కువగా రాలేకపోతున్నారు. నేటి డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేసేశేరారని ఆమె అంటోంది.తనవద్దకు పేదవాళ్ళు ఎవరైనా వస్తే వారిదగ్గర నుండి డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసేదట భక్తియాదవ్. ఆమె చేయి పడితేచాలని వైద్యం చేయించుకోవడానికి  భక్తియాదవ్ హాస్పిటల్ కు చాలా దూరాలనుండే తరలివచ్చే వారని స్థానికులు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top