సంపూ "భద్రం బీ కేర్ పుల్ బ్రదరూ" సిినిమా ట్రైలర్. సంపు సంపేశాడు భయ్యా!

‘హృదయ కాలేయం’ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి బర్నింగ్ స్టార్ గా అలరిస్తున్నాడు సంపూర్నేశ్ బాబు. అభిమానులచే ముద్దుగా సంపూ అని పిలిపించుకుంటున్న సంపూ, తాజాగా ‘భద్రం బీ కేర్ పుల్ బ్రదరూ’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై  నెట్ లో హల్చల్ చేస్తోంది. సంపూ చెబుతున్న డైలాగ్స్ కేక పుట్టిస్తున్నాయి. రాజేష్ పులి అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సంపూ సరసన హమిద కథానాయికగా నటిస్తోంది.

 maxresdefault
ఈ చిత్రంలో సంపూర్నేష్ బాబు సినిమా చేస్తుంటారు ఒక బ్యాచ్. రేసుగుర్ర్రంలో అల్లుఅర్జున్ లా హీరో ఎంట్రీ ఇచ్చి, మగధీరలో రామ్ చరణ్ ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్ కు స్టెప్పులేస్తాడు బర్నింగ్ స్టార్. ‘వాళ్ళను ముందు కొట్టమను, తర్వాత నేను కొడతాను, నేను ముందే కొడితే అరగంట వరకు లేవరు, అనవసరంగా టైం వేస్ట్ ‘ అనే డైలాగ్ ను సంపూ భలేచెప్పాడు . ‘మీరు ప్రతిదీ మాకు చెప్పకండి బాబూ, కెమెరా ఆన్ లో ఉంది అని డైరెక్టర్ చెబితే,నీకెవరు చెప్పారబ్బా ఆడియెన్స్ కు, నా అభిమానులకు చెప్తున్నా, ఆర్ యూ లిజినింగ్ గాయ్స్’ అంటూ ట్రైలర్  చివర్లో పంచ్ పేల్చాడు సంపూ.  జెబి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమా షూటింగ్ సాంగ్ బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా థియేటర్లలో అలజడి సృష్టించడానికే ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’ అంటూ చిన్న హింట్ ఇచ్చినట్లున్నాడు.
Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top