చైనా నుంచి దిగుమ‌తి చేసుకోబ‌డ్డ డ‌బ్బు కౌంటింగ్ మిష‌న్లలో గడ్ బడ్…జాగ్రత్త సుమీ.!

డ‌బ్బులు పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు అవి చేతిలో ఉంటే  ఎవ‌రైనా వాటిని లెక్క పెట్ట‌కుండా అవ‌తలి వారికి ఇస్తారా..? ఇవ్వ‌రు గాక ఇవ్వ‌రు. ఒక‌టికి రెండు సార్లు బాగా లెక్క పెట్టి మ‌రీ డ‌బ్బుల‌ను అవ‌త‌లి వ్య‌క్తులకు ఇస్తారు. వారు కూడా మళ్లీ ఒక‌టికి రెండు సార్లు ఆ డ‌బ్బును లెక్కించి గానీ త‌మ‌కు పూర్తి మొత్తం ల‌భించింద‌ని రూఢి చేసుకోరు. ఎవ‌రైనా ఎందుక‌లా చేస్తారు..? ఎందుకు చేయ‌డ‌మేమిటి..? డ‌బ్బు క‌దా, ఆ మాత్రం జాగ్ర‌త్త ఉండొద్దు, ఒక‌టి, రెండు నోట్లు ఎక్కువైనా, త‌క్కువైనా ఇబ్బందే క‌దా. అనంత‌రం బాధ ప‌డి కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుకే డ‌బ్బు క‌ట్ట‌ల‌ను జాగ్రత్త‌గా లెక్కిస్తారు. అయితే మ‌నం మ‌నుషులం కాబ‌ట్టి డ‌బ్బును అంతగా ప‌ట్టి, ప‌ట్టి మ‌రీ క‌చ్చితంగా లెక్కిస్తాం. అదే డ‌బ్బును లెక్కించే మిషన్ల‌యితే..?  అవి మిషన్లు క‌దా, పొర‌పాటు చేయ‌వు, డ‌బ్బును క‌చ్చితంగా లెక్కిస్తాయి. అని మీరు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లో న‌కిలీల రాజ్యం న‌డుస్తోంది క‌దా. అది డ‌బ్బు కౌంటింగ్ మిషన్ల వ‌ర‌కు పాకింది.

chinese-money-counting-mach

చైనాలో త‌యారు కాబ‌డిన డ‌బ్బు కౌంటింగ్ మిష‌న్లు ఇప్పుడు మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. వాటి ద్వారా డ‌బ్బును లెక్కిస్తే ఎప్ప‌టికీ క‌చ్చిత‌మైన సంఖ్య రాద‌ట‌. అంతేకాదు, డబ్బును లెక్క పెట్టే సంద‌ర్భంలో కొన్ని నోట్లు ఏకంగా మెషిన్ లోప‌లికి మ‌న‌కు తెలియ‌కుండానే వెళ్తున్నాయ‌ట‌. అలాంటి మిషన్లను ఇప్పుడు దేశంలో ఎక్కువ‌గా వాడుతున్నార‌ట‌. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌..! మీరు ఎక్క‌డికి వెళ్లినా ఈ డ‌బ్బు కౌంటింగ్ మిషన్ల‌పై ఓ క‌న్నేసి ఉంచ‌డం ఉత్త‌మం. లేదంటే డ‌బ్బులు పోయిన త‌రువాత బాధ ప‌డి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

కింద ఇచ్చిన వీడియోను చూశారా..?  పైన మేం చెప్పిన డ‌బ్బు కౌంటింగ్ మిష‌న్ లాంటిదే ఈ మిష‌న్ కూడా. దాంట్లో ఓ వ్య‌క్తి 50 నోట్లు ఉన్న క‌ట్ట‌ను పెట్టాడు. అయితే అందులో రీడింగ్ ముందు రెండు సార్లు 40, 40 వ‌చ్చింది. అనంత‌రం 30, 29, 22, 19, 15, 13, 12, 10 ఇలా వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కొన్ని నోట్లు మిష‌న్ లోప‌లికి వెళ్లాయి కూడా. వీడియో చివ‌ర్లో చూస్తే మీక‌ది అర్థ‌మ‌వుతుంది. క‌నుక  చైనా నుంచి దిగుమ‌తి చేసుకోబ‌డ్డ ఇలాంటి మిష‌న్ల‌ను మీరు గ‌మ‌నిస్తే వెంట‌నే సంబంధిత అధికారులకు తెలియ‌జేయండి. న‌లుగురికీ ఈ విష‌యం గురించి తెలియ‌ప‌ర‌చండి.

Comments

comments

Share this post

scroll to top