నిద్రించే విధానంపై మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందా..? అవునో, కాదో తెలుసుకోండి..! ఈ 10 పద్దతులు పాటించండి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా, ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే మంచిదో, దాని వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమొఖం, పెడమొఖంగా నిద్రిస్తే…
దాదాపుగా భార్యాభర్తలే ఈ విధంగా నిద్రిస్తారు. ఒకరి దిక్కు మరొకరు చూడకుండా ఎడమొఖంగా పడుకుంటారు. దాదాపు 55 శాతం వరకు జంటలు ఈ విధంగానే నిద్రిస్తారట. అయితే ఇలా వారు నిద్రించడాన్ని బట్టి చూస్తే ఆ దంపతులు రిలేషన్‌షిప్ సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదనో, మరే ఇతర కారణం వల్లో వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగా లేవని గుర్తించాలి.
xpgy5vw7r19jsnpinejr
ఒకరికి ఎదురుగా మరొకరు నిద్రిస్తే… 
జీవిత భాగస్వాములిద్దరూ ఒకరికి ఎదురుగా మరొకరు నిద్రిస్తే ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే వారు తమ ప్రేమను పంచుకునేందుకు ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.
nd3ebtlv9gk1v8ryr4m1
స్పూనింగ్… 
ఒకరినొకరు పెనవేసుకున్నట్టు నిద్రించే స్పూనింగ్ పద్ధతిలో దంపతులకు నొప్పులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరహా విధానాన్ని పాటించకపోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ విధానంలో దంపతులిద్దరూ ఒత్తిడికి కూడా గురవుతారట.
ybggnw1ntj5p2cql7b6y
బెడ్ అంచులకు నిద్రిస్తే… 
దంపతులిరువురూ చెరో బెడ్ అంచుకు వచ్చి ఇద్దరూ ఎడమొఖంగా నిద్రిస్తే చాలా మంచిదట. ఇలా నిద్రించే జంటల్లో 90 శాతం జంటలు సంతోషంగా ఉంటారట.
ts9o80clki1h6pfllkew
చేతులు పైకి పెట్టి నిద్రిస్తే… 
చిత్రంలో చూపిన విధంగా చేతులను వెనకగా పెట్టి నిద్రిస్తే మంచిదేనట. దీని వల్ల ముఖంపై ముడతలు, గురక, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయట. అయితే దీని వల్ల భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతుందట. దీన్ని తట్టుకోవాలంటే కింద కొన్ని మెత్తలను పెట్టుకుంటే సరిపోతుందట.
g05puthdotj1jfh3ie9j
దిండును కావలించుకుని పడుకుంటే… 
దిండును కావలించుకుని పడుకుంటే కీళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుందట. ఇలా పడుకోవడం కూడా మంచిదేనని వైద్యులు చెబుతున్నారు.
ey45pafvew6s6pyldtx2
కడుపులో పిండం మాదిరిగా నిద్రిస్తే… 
తల్లి కడుపులో బిడ్డ ఉన్న మాదిరిగా నిద్రించడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మెడ, వెన్నెముక సమస్యలు వస్తాయట. అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందట.
e963wd867lrs0lmd44yy
బోర్లా పడుకుంటే… 
బోర్లా పడుకోవడం కూడా మంచిది కాదట. దీంతో చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుందట. దీని వల్ల శ్వాస సమస్యలు కూడా వస్తాయట.
933b5qlbc7tzlep9rn01
ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకుంటే… 
బెడ్‌పై ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకుంటే వెన్నెముక సమస్యలు రావట. అయితే దీని వల్ల చర్మంపై ముడతలు వస్తాయట. కానీ ఈ పద్ధతిలో ఎక్కువ సేపు మాత్రం నిద్రించకూడదట.
2fko9db12znz5fy7emeg
వెల్లకిలా పడుకుంటే… 
అన్ని భంగిమల్లోకెల్లా వెల్లకిలా తిరిగి పడుకోవడం ఉత్తమమైందట. దీని వల్ల మెడ, వెన్నెముకలకు చెందిన సమస్యలు రావట. దాదాపు అందరూ ఈ విధానంలో ఎక్కువ సేపు నిద్రించవచ్చట.
jfj1nbg4byzmzjfc44ry

Comments

comments

Share this post

scroll to top