భేతాళుడు రివ్యూ & రేటింగ్ ( తెలుగులో )

Cast & Crew:

  • హీరో, హీరోయిన్: విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్
  • దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి
  • సంగీతం: విజయ్ ఆంటోని

Story:

దినేష్( విజయ్ ఆంటోని) ఓ ప్ర‌ముఖ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగి. అంద‌రి కంటే వేగంగా ప‌ని చేయ‌గ‌లిగే స‌త్తా ఉన్న తెలివైన‌ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి చూపుల కోసం మ్యాట్రిమెనిలో అమ్మాయి కోసం వెతుకుతుంటే అనాథ అయిన ఐశ్వ‌ర్య (అరుంధతి నాయర్) అనే అమ్మాయి ప్రోఫైల్ చూసి ఇష్ట‌ప‌డుతాడు. వెంట‌నే పెళ్లికి ఒప్పుకుంటాడు. కొత్తగా పెళ్ల‌యి 10 రోజులు గ‌డువ‌క ముందే త‌న జీవితం ఇబ్బందుల్లోకి వెళుతుంది. విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ప్ర‌తి చిన్న విష‌యానికి భ‌య‌ప‌డ‌టం.. ఏదో గొంతు వెంటాడుతున్న భ్ర‌మ‌లోకి వెళుతాడు. ఇదే స‌మ‌యంలో స్నేహితుడు ర‌వి స‌హ‌యంతో ఓ మంచి మాన‌సిక వైద్యుడిని సంప్ర‌దిస్తాడు. అయితే అత‌ని ట్రీట్ మెంట్ తో గ‌త జ‌న్మ‌లోకి వెళ్లిపోతాడు దినేష్. ఈ స‌మ‌యంలోనే రోడ్డు యాక్సిడెంట్ లో త‌న ఫ్రెండ్ ర‌వి చ‌నిపోతాడు. మ‌రింత డిఫ్రెష‌న్ లోకి వెళ్లిపోతాడు. ఆ స‌మ‌యంలోనే గ‌త జ‌న్మ పూర్తిగా గుర్తుకు వ‌స్తుంది. ఆ జ‌న్మ‌లో త‌న పేరు శ‌ర్మ అని.. త‌న‌ని త‌న భార్య జ‌య‌ల‌క్ష్మి చంపేసింద‌న్న నిజాన్నితెలుసుకుంటాడు. దానికి కార‌ణం జ‌య‌ల‌క్ష్మి న‌ట‌రాజ్ అనే వ్య‌క్తి తో సంబంధం పెట్టుకోవ‌డం.. ఆ సంబంధం వ‌ల్ల ఓ బాబు క‌ల‌గ‌డం.. ఆ బాబు అనుకోకుండా శ‌ర్మ చేతిలో చ‌నిపోవ‌డంతో ప‌గ పెంచుకున్న జ‌య‌ల‌క్ష్మి ప్రియుడు న‌ట‌రాజ్ తో క‌లిసి శ‌ర్మ‌ని చంపేసింద‌ని తెలుసుకుంటాడు. అయితే జ‌య‌ల‌క్ష్మి శ‌ర్మ‌ను ఎందుకు చంపేసింది అన్న‌ది మాత్రం తెర‌పై చూడాల్సిందే. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్.. ఈ జ‌న్మ‌లో కూడా జ‌య‌ల‌క్ష్మి త‌న భార్యే కావ‌డం.

Plus Points:

  • కథ, క‌థ‌నం
  • విజయ్ నటన
  • నేపథ్య సంగీతం

Minus Points:

  • స్లో నేరేషన్
  • క్లైమాక్స్ సీన్

Verdict:
మొత్తానికి అభిమాన భేతాళుడు.. సైకలాజికల్ థ్రిల్లర్

Rating: 2.5/5

Trailer

Comments

comments

Share this post

scroll to top