విర‌బూసిన సాహిత్యం ప‌ర‌వ‌సించిన జ‌నం – జ‌నాద‌ర‌ణ పొందిన పాటలివే

ఎవ‌ర‌న్నారు సాహిత్యం కూడు పెట్ట‌ద‌ని. ఇపుడు రాసే వాళ్లకు ఎన‌లేని గిరాకీ దొరుకుతోంది. రాసే ద‌మ్ముండాలి కానీ . అవ‌కాశాలు అపారం. కావాల్సింద‌ల్లా ప‌ట్టు దొర‌క‌డ‌మే. క‌విత్వం రాసే క‌వులు ఎక్క‌డైనా దొరుకుతారు. త‌మ ఆవేద‌న‌ను . ఫాంట‌సీల‌ను వెళ్ల‌బోసుకుంటూ అక్షరాల్లోకి ఒలికిస్తూ క‌నిపిస్తుంటారు. కాసింత టైంలో కొద్ది స్పేస్‌లో .జ‌నానికి ఊపు వ‌చ్చేలా.మ‌న‌సుకు హ‌త్తుకునేలా రాసే గేయ ర‌చ‌యిత‌లు త‌క్కువే. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అవే డ్ర‌మ్ములు.అవే మోత‌లు.వామ్మో త‌లుచుకుంటేనే భ‌యం క‌లుగుతుంది. ర‌ణ‌గొణ‌ధ్వ‌నుల మ‌ధ్య విన‌సొంపైన సాంగ్స్ వ‌చ్చాయి. కొత్త వాళ్లు త‌మ క‌లాల‌కు ప‌దును పెడుతున్నారు. డిఫ‌రెంట్ గా రాయ‌క పోయినా.చిన్న చిన్న ప‌దాల‌తో పాట‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. వాటిల్లో ఎక్కువ‌గా సినిమాలు ఆడాయి. యూట్యూబ్‌లో మిలియ‌న్ వ్యూయ‌ర్స్‌ను దాటేసిన పాట‌లేమిటో చూస్తే తెలుస్తుంది. ప్ర‌తి ఏడు లాగే ఈసారి పాట‌లు జ‌నాల పెదాల మీద న‌ర్తించేలా చేశాయి. మెలోడీలు వ‌చ్చాయి. రొమాంటిక్ సాంగ్స్ ఆక‌ట్టుకున్నాయి. కొన్ని జోష్ నింపుతూనే ఉన్నాయి.

best telugu songs of 2018

యూట్యూబ్ ను షేక్ చేసిన ఆ సాంగ్స్ వింటూ వుంటే.ఇంకా వినాల‌ని అనిపిస్తున్నాయి. మ‌ధుర‌మైన పాట‌లు ఎన్నో వ‌చ్చాయి వాటిలో కొన్ని మ‌రింత పాపుల‌ర్ అయ్యాయి. జ‌నానికి బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఆరు కోట్ల మందికి పైగా వ్యూవ‌ర్స్ తో రికార్డు బ్రేక్ చేసింది.గీత‌గోవిందం సినిమాలోని సాంగ్. ప‌రుశురామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక న‌టించారు. ఇంకేం ఇంకేం కావాలే.దీనిని అనంత్ శ్రీ‌రాం రాశారు. గోపీ సుంద‌ర్ దీనికి మ్యూజిక్ డైరెక్ట‌ర్. సిద్ శ్రీ‌రామ్ ఈ పాట‌ను పాడారు. ఇదే హ‌య్య‌స్ట్ వ్యూవ‌ర్స్‌ను స్వంతం చేసుకుంది. ఇదో రికార్డు. ఆర్ ఎక్స్ -100 సినిమా. ఇది కూడా బాగా ఆడింది. విప‌రీతంగా ఆద‌రించారు. కొంచెం రొమాన్స్ ఎక్కువైంది. కార్తికేయ , పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించారు. అజ‌య్ భూప‌తి ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో పిల్ల రా.అంటూ అనురాగ్ కుల‌క‌ర్ణి పాడిన పాట‌ను 85 లక్ష‌ల మందికి పైగా చూశారు.విన్నారు. ఇది కూడా యూట్యూబ్ లో హిట్టే. విజ‌య్, ప్రియాంక జంట‌గా న‌టించిన టాక్సీవాలో మూవీలోని మాటే విన‌దుగా సాంగ్ పాపుల‌ర్ అయింది. వైర‌ల్ కూడా. రాహుల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌గా సిద్ శ్రీ‌రాం పాడారు. కోటి 94 ల‌క్ష‌ల వ్యూవ‌ర్స్ దీనికి క‌నెక్ట్ అయ్యారు.

రామ్ , స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం సినిమాకు సుకుమార్ డైరెక్ట‌ర్. రంగ‌మ్మా.మంగ‌మ్మ అంటూ దేవిశ్రీ సంగీతం అందించ‌గా చంద్ర‌బోస్ రాయ‌గా ఎం.ఎం.మాన‌సి పాడిన పాట మ‌రింత పాపుల‌ర్ సాంగ్ గా పేరు తెచ్చుకుంది. మిలియ‌న్ వ్యూవ్స్‌ను దాటేసింది. ఇదే మూవీలోని జిల్ జిల్ జిగేల్ రాణి సాంగ్ ను చంద్ర‌బోస్ రాయ‌గా రేలా కుమార్, గంటా వెంక‌ట ల‌క్ష్మి పాడారు. భారీ వ్యూవ‌ర్స్ ను మూట‌గ‌ట్టుకుంది. దివంగ‌త న‌టి సావిత్రిపై తీసిన మ‌హాన‌టి సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందించారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన మ‌హా న‌టి.మ‌హాన‌టి.పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు. ఈ సాంగ్ కూడా కోటి దాటింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీగా నిలిచింది. దీనికి దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. మహేష్ బాబు న‌టించారు. రామ‌జోగ‌య్య రాసిన వ‌చ్చాడ‌య్యో సామీ.అనే పాట‌ను కైలాష్ కేర్ పాడారు. ఈ పాట‌ను యూట్యూబ్‌లో ల‌క్ష‌ల్లో చూశారు. ఇది కూడా పాపుల‌ర్ సాంగ్ గా నిలిచింది. త్రివిక్రం శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన అర‌వింద స‌మేత మూవీ స‌క్సెస్ ఫుల్ గా నిలిచింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇందులో హీరో. దీనికి త‌మ‌న్ సంగీతం అందించారు. పెనిమిటి సాంగ్‌ను హ‌రిరామ జోగ‌య్య రాశారు.

కాల‌భైర‌వ పాడిన ఈ పాట‌ను 2 కోట్ల‌కు పైగా చూశారు. ఇదో రికార్డు. దారి చూడు ద‌మ్ము చూడు.ఈ పాట ఒక రేంజ్‌లో హిట్ట‌యింది. అనంత‌పురం జిల్లాకు చెందిన టీచ‌ర్ పెంచిక‌ల దాస్ రాసి .పాడారు. నాని న‌టించిన కృష్ణార్జున యుద్దం మూవీలోనిది. దీనిని మూడు కోట్ల‌కు పైగా చూశారు. చ‌లో మూవీ కోసం భాస్క‌ర భ‌ట్ల రాయ‌గా అనురాగ్ కుల్ క‌ర్ణి, సాగ‌ర్ పాడిన చూసీ చూడంగానే న‌చ్చేశావే ను భారీగానే చూశారు. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ డైరెక్ష‌న్లో రాబోతున్న ఎన్టీఆర్ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. రెండు పాట‌లు విడుద‌ల చేశారు. అవి హిట్టే. క‌థానాయ‌కా అంటూ కైలాష్ కేర్ పాడిన పాట దుమ్ము రేపుతోంది. అంచ‌నాలు పెంచేసింది. స‌తీష్ వేగ్నేష డైరెక్ష‌న్లో వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీ‌నివాస క‌ళ్యాణం పాట‌లు తెలుగు వారిని ఆక‌ట్టుకున్నాయి. శ్రీ‌మ‌ణి రాసిన పాట‌లు పాపుల‌ర్ అయ్యాయి. అత్తారింటికి దారేది , అజ్ఞాత వాసి సినిమాల్లోని పాట‌లు హిట్ గా నిలిచాయి. మొత్తం మీద విజ‌య్ అనుకోకుండా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. పాటలు కూడా. ఇదే ఇండ‌స్ట్రీని ఊపేస్తోంది.

Comments

comments

Share this post

scroll to top