“ధోని” కెరీర్ లో బెస్ట్ స్టంపింగ్ ఇదే..”మెరుపు కంటే వేగంగా”.! కుల్దీప్ హ్యాట్రిక్.! నిన్నటి మ్యాచ్ హైలైట్ !

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో తానే బెస్ట్ వికెట్ కీపర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హిట్టర్ మాక్స్‌వెల్‌ని కళ్లుచెదిరే రీతిలో ధోనీ స్టంపౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మాక్స్‌వెల్ క్రీజులోకి రాగానే.. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనబడింది. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్‌లోనే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు.

ఈ దశలో ధోనీతో చర్చించిన కెప్టెన్ కోహ్లి స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్‌ని అతనిపై‌కి ప్రయోగించాడు. తొలుత ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులేస్తూ వచ్చిన.. చాహల్ బౌలింగ్‌లో సింగిల్స్ కోసం ప్రయత్నించిన మాక్స్‌వెల్ క్రమంగా బ్యాట్ ఝళిపించేందుకు ట్రై చేశాడు. ఇది గమనించి ధోనీ.. ఎక్కువ టర్న్ చేయాల్సిందిగా చాహల్‌కి సైగల ద్వారా సూచించాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో చాహల్ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వెళ్లి ఆడేందుకు మాక్స్‌వెల్ యత్నించాడు. అయితే.. బంతి టర్న్ తీసుకుని మాక్స్‌వెల్ వెనక్కి లెగ్‌సైడ్ వైడ్ రూపంలో వెళ్లింది. అప్పటికే బంతి గమనాన్ని పసిగట్టిన ధోనీ.. వేగంగా బంతి అందుకుని క్షణాల్లో పక్కకి పడిపోతూ వికెట్లని బలంగా ఎగరగొట్టేశాడు. అప్పటికే స్టంపౌట్ ప్రమాదం పసిగట్టి మాక్స్‌వెల్ వెనక్కి వచ్చేందుకు చూసినా.. గాల్లోని బెయిల్స్ అతనికి స్వాగతం పలికాయి. డైవ్ చేస్తూ మెరుపు వేగంతో ధోనీ చేసిన ఈ స్టంపౌట్ అతని కెరీర్‌లోనే ది బెస్ట్‌ అని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. 253 పరుగుల లక్ష్య ఛేదనలో అప్పటికి ఆస్ట్రేలియా 22.5 ఓవర్లలో 106/4తో నిలిచింది.

watch video here:

వికెట్ వెనకాల ధోని ఉండగా…బ్యాట్స్ మెన్ ముందుకి వెళ్ళకూడదు. ఎందుకంటే ధోని అవుట్ చేస్తాడు అని తెలియదా అని ట్విట్టర్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లను ట్రోల్ చేసారు ధోని అభిమానులు.

హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు కుల్దీప్ యాదవ్. రెండో వన్డేలో ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. రెండో బంతికి మాథ్యూ వెడ్‌ (2)ని బౌల్డ్ చేసి.. మూడో బంతికి అగర్‌ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నాలుగో బంతిని ఎదుర్కొన్న పాట్ కమిన్స్ (0) శాయశక్తులా హ్యాట్రిక్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ బంతిని ప్లిక్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ని తాకుతూ వెళ్లి కీపర్ ధోనీ చేతుల్లో పడింది.

Comments

comments

Share this post

scroll to top