కండోమ్ ఛాలెంజ్. ఇదేదో వినడానికి కొత్త పేరులా ఉందే అనుకోకండి.ఇంతకుముందు ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ చూశారుగా.. ఇది కూడా అలాంటిదేనండి. పేరే కొంచెం పిలవడానికి ఎబ్బెట్టుగా వున్నా,,ఈ ఛాలెంజ్ ఒక మంచి ప్రయత్నం కోసమేలెండి. మనందరిలో చైతన్యం తీసుకురావడానికి కొందరు ఔత్సాహికులు ఈ ఛాలెంజ్ ని మొదలుపెట్టారు. ఒక కండోమ్ ను తీసుకొని,దాని నిండా నీటిని నింపి.. ఒక వ్యక్తిని కింద కూర్చోమని, ఇంకొకతను ఆ నీటిని నింపిన కండోమ్ ను కూర్చున్న అతడి తలపై వేస్తాడు. ఆ కండోమ్ పగిలిపోకుండా, వాటర్ అలానే ఉన్నట్లయితే మీ కండోమ్ ఛాలెంజ్ సక్సెస్ అయినట్లు, ఒకవేళ ఆ కండోమ్ బద్దలయినట్లయితే మీరు కండోమ్ ఛాలెంజ్ లో విఫలమైనట్లే….
ఇదేదో సరదా కోసం చేసిందికాదు. సేఫ్ సెక్స్ గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడానికి ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. ఆడ,మగ అనే లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కండోమ్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడిదే సోషల్ నెట్ వర్క్స్ ఎక్కడ చూసినా ట్రెండీగా మారింది. వీలయితే మీరూ ట్రై చేయండి.
Watch VIdeo: