రోజూ 2 కి.మీ ఈదుకుంటూ ఉద్యోగానికి వెళుతున్న బెంజిమ‌న్!

మీరు ఆఫీసుకి ఎలా వెళ్తారు బైక్ ,కార్ ,బస్ లో వెళ్తారు.లేదా కొందరు రైలులో కూడా ఆఫీస్ కి వెళ్లే వాళ్లుంటారు.కానీ ఇతను ఆఫీస్ కి వెళ్లడినికి వింత మార్గాన్ని ఎంచుకున్నాడు.పైగా తన అభిరుచిని కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నానని అంటున్నాడు..అతడే బెంజిమిన్ డేవిడ్..వయసు నలభై సంవత్సరాలు… ఉండేది జర్మనీలోని మ్యూనిచ్‌..ట్రాఫిక్ బాదనుండి తప్పించుకోవడానికి ఇతను ఎంచుకున్న విచిత్ర విధానం ఏమనుకుంటున్నారు…ఈదుకుంటూ వెళ్లడం..

గత రెండేళ్లగా ఆయన ఆఫీసుకు నదిలో ఈదుకుంటూ వెళుతున్నాడు.ఇందుకోసం బెంజిమన్ ఇసర్ అనే నదిలో రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లి ఆఫీసుకు చేరుకోవడం ప్రారంభించాడు. దీంతో ఎంతో ఆనందంగా ఉండడమే కాకుండా పలు ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పాడు. బెంజిమన్ ప్రతీరోజూ ఉదయం నది ఒడ్డుకు చేకుంటాడు. తరువాత సూట్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, పర్స్, షూస్ మొదలైనవన్నీ తీసేసి ఒక వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాడు. తరువాత బ్యాగును వీపునకు తగిలించుకుని నీటిలో దిగి ప్రయాణం ప్రారంభిస్తాడు. బెంబిమెన్ పనిచేసే కార్యాలయం నది ఒడ్డున ఉండడం ఆయనకు కలిసొచ్చింది. ఇతనిని చూసిన కొంతమంది కొలీగ్స్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. నదిలో ఈదుకుంటూ వెళ్లడం వలన ప్రతీరోజూ అతనికి స్నానం చేసే బాధ తప్పింది. అలాగే 2 కిలోమీటర్లు ఈత కొట్టడం వలన శారీరక వ్యాయామం జరిగి ఆరోగ్యం సమకూరుతోంది.రోడ్లపై ఉండే విపరీతమైన ట్రాఫిక్‌కు విసుగెత్తిన బెంజిమన్ ఈ విధానాన్ని ఎంచుకున్నాడు. బైక్ మీద వెళుతుంటే కార్లను దాటుకుని వెళ్లడం ఇబ్బందిగా ఉంది. పోనీ నడిచి వెళదామంటే సైకిళ్లు నడిపే వారితో అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ విధంగా ప్రతీరోజూ ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. అందుకే నదిలో ఈదుకుంటూ ఆఫీస్‌కు వెళ్లిపోవడం మంచిదనిపించిందని ఫీలవుతున్నాడట…

Comments

comments

Share this post

scroll to top