ఈ రోజు రాత్రి 12 తర్వాత పుట్టబోయే బిడ్డకు బంపర్ ఆఫర్…5 లక్షలు..కానీ షరతు ఏంటంటే.?

మ‌న దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఆడ‌పిల్ల‌ను భారంగానే చూస్తున్నారు. ఆడ పిల్ల పుడుతుందంటే చాలు ఇంట్లో, బ‌య‌ట సూటి పోటి మాట‌ల‌తో జ‌నాలు కాల్చుకుతింటారు. ఇక కొంద‌రు అయితే ఆడ‌పిల్ల అని తెలిస్తే అబార్ష‌న్ చేయించుకునేందుకు లేదా పుట్టాక చెత్త కుప్ప‌ల్లో పారేసేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. నేడు మ‌నం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా ఈ విష‌యంలో మాత్రం ఇంకా వెనుకబ‌డే ఉన్నాం. అయితే జ‌నాల్లో ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ఉన్న ఈ అపోహ‌ల‌ను తొల‌గించేందుకు బెంగుళూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఓ వినూత్న ఆలోచ‌న చేసింది. అదేమిటంటే…

డిసెంబ‌ర్ 31 అర్థ‌రాత్రి త‌రువాత బెంగుళూరులోని సివిక్ హాస్పిట‌ల్ (ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌)లో జ‌న్మించ‌బోయే ఆడ‌ శిశువుకు డిగ్రీ వ‌ర‌కు ఉచిత విద్య‌ను అందిస్తామ‌ని ఆ న‌గ‌ర మేయ‌ర్ ఆర్‌.సంప‌త్ రాజ్ అనౌన్స్ చేశారు. అయితే శిశువు స‌హ‌జ సిద్ధ‌మైన డెలివ‌రీ ద్వారా జ‌న్మించాలి. సిజేరియ‌న్ ద్వారా కాదు. స‌హ‌జ సిద్ధమైన డెలివ‌రీ ద్వారా జ‌న్మించిన మొద‌టి శిశువుకే ఈ అవ‌కాశం ద‌క్క‌నుంది.

అయితే అలా మొద‌ట జన్మించే ఆడ‌ శిశువుకు కార్పొరేష‌న్ వారు రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు ఇస్తారు. దాన్ని ఆ శిశువు పేరిట బ్యాంక్‌లో వేస్తారు. ఆ శిశువు పెద్ద‌య్యాక ఆ మొత్తాన్ని త‌న చ‌దువులు లేదా ఇత‌ర ఖ‌ర్చుల కోసం తీసుకోవ‌చ్చు. దేశంలో ఆడ‌పిల్ల‌ల‌ను క‌న‌డ‌మే భారంగా ఉంద‌ని జ‌నాలు అనుకుంటున్న నేటి త‌రుణంలో వారిలో ఉన్న ఈ అపోహ‌ల‌ను తొల‌గించ‌డానికే ఈ ఆలోచ‌న చేసిన‌ట్టు మేయ‌ర్ తెలిపారు. ఏది ఏమైనా ఈ ఆలోచ‌న చేసినందుకు వారిని అభినందించాల్సిందే. కానీ పేద శిశువులంద‌రికీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top