కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గడుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంట్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు స‌మృద్ధిగా ఉన్నాయి. పొటాషియం, సోడియం, డైట‌రీ ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, మెగ్నిషియం, కాల్షియం, సెలీనియం వంటి ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ కొబ్బ‌రి నీటిలో ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు సంపూర్ణ పోష‌కాహారం అంద‌డ‌మే కాదు, ప‌లు అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. అయితే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 50 – 60 ఎంఎల్ మోతాదులో కొబ్బ‌రి నీళ్లను తాగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. ఆ ప్ర‌యోజ‌నాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

coconut-water

1. కొబ్బ‌రి నీళ్ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురి కాకుండా ఉంటుంది. దీంతో శ‌రీరంలో ఉన్న ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన మిన‌ర‌ల్స్‌, ఎల‌క్ట్రోలైట్స్ ఉద‌యాన్నే అందుతాయి, కాబ‌ట్టి రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు.

2. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. న‌రాల సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. కండ‌రాల‌కు పుష్టి క‌లుగుతుంది.

3. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. రక్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.

4. కొబ్బ‌రినీళ్ల‌లో సైటోకినిన్స్ అన‌బ‌డే పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తాయి. చ‌ర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి.

5. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. ప్ర‌ధానంగా అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

6. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీంతో వివిధ ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లకు వ్య‌తిరేకంగా పోరాడే శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తుంది.

7. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది.

8. బీపీ అదుపులోకి వ‌స్తుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Comments

comments

Share this post

scroll to top