అర్జున వృక్షం గొప్పతనం తెలుసా?వైద్యపరంగా అబ్బుర పరిచే అద్భుత శక్తి దాని సొంతం.!

అర్జున వృక్షం( తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు…..దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట.! అంతే కాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం , మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ ఫుల్ ఔషదంగా అనేక మందుల్లో ఉపయోగిస్తున్నారు.

గుండె జబ్బుల వారికి:
అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది, ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది.

ఆస్తమా ఉన్నవారికి:
అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే శ్వాస నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, ఆస్తమాను తగ్గేలా చేస్తుంది.

arjuna chettu

విరిగిన ఎముకలకు:
అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా ప్రాఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో..ఎముకను అతిచింకడానికి ఇదే ప్రధాన ఔషదం. దీనిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడతాయి.

ముఖంపై మొటిమలకు:
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ ల కంటే 3 రెట్లు ప్రభావాన్ని చూపుతుంది.

  • అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.

  • అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది.

  • అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. అంతటి పవర్ అర్జున బెరడు సొంతం.

  • 14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top