పేద‌ల‌కు అండ‌గా…. IPS మంజిత వంజ‌ర‌.

పోలీసులు అంటే దొంగ‌ల‌ను, కేడీల‌ను, గూండాల‌ను ప‌ట్టుకుని జైల్లోకి పంపేవారు మాత్ర‌మే కాదు… ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించేవారు… వారికి ఏమైనా ఇబ్బందులు వ‌స్తే మేమున్నామ‌ని చూసుకునేవారు కూడా… ఎంత ధ‌నం సంపాదిస్తున్నామ‌ని కాదు, ఎంత మందికి సేవ చేస్తున్నాం… అనేదే ముఖ్యం..! ఇవి మేమంటున్న మాట‌లు కావు. ఆ ఐపీఎస్ ఆఫీస‌ర్ అంటున్న మాట‌లు. ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి ఫ్యాష‌న్ డిజైనింగ్ చేసి… ఆ రెండూ కాద‌ని చెప్పి, దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌లంపుతో క‌ష్ట‌ప‌డి చదివింది ఆమె. ఐపీఎస్ అధికారిణి అయి స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాదు, సంఘ సేవ‌కురాలిలా మారి, మ‌హిళలు, పిల్ల‌ల సంర‌క్ష‌ణ కోసం కృషి చేస్తుంది ఆమె. ఆమె పేరే మంజిత వంజ‌ర‌.

manjitha

మంజిత వంజ‌ర‌ది అహ్మ‌దాబాద్‌. ధ‌నిక కుటుంబంలో జ‌న్మించింది. ఆమె ఇంట్లో వారే కాదు, బంధువులు చాలా వ‌ర‌కు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా కొలువు చేస్తున్న‌వారే. అయితే అంద‌రూ అంత‌టి ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్నా మంజిత‌ను సాధార‌ణ ఆడ‌పిల్ల‌లాగే పెంచారు. ధ‌నికుల‌మ‌ని చెబుతూ ద‌ర్పం చాటుకునేలా ఎప్పుడూ పెంచ‌లేదు. ఈ క్ర‌మంలో ఆమె కాలేజీకి వెళ్లినా బ‌స్సుల్లోనే వెళ్లేది త‌ప్ప‌, కార్లు, బైకుల్లో వెళ్లేది కాదు. దీంతో న‌లుగురితో క‌ల‌సి తిర‌గ‌డం, సామాజిక సేవ ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌గ‌డం వంటివి మంజిత‌కు అల‌వాట‌య్యాయి. అయితే ఇంట్లో అందరూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నారు కానీ, ఆమె మాత్రం అటు వైపు వెళ్ల‌లేదు. నిర్మా యూనివ‌ర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో ప‌ట్టా పొందిందిం. అనంత‌రం నిఫ్ట్‌లో చేరి ఫ్యాష‌న్ డిజైనింగ్ పూర్తి చేసింది.

అయితే ఆ స‌మయంలో మంజిత‌కు ప్ర‌జా సేవ, ర‌క్ష‌ణ‌ ప‌ట్ల ఇంకా ఆస‌క్తి పెర‌గ‌డంతో ఐపీఎస్ కావాల‌నుకుంది. దీంతో 2011లో మొద‌టి సారి సివిల్స్ రాసింది. 2013లో ఎగ్జామ్స్ క్లియ‌ర్ చేసి ఐపీఎస్ అయింది. అప్ప‌టి నుంచి ఆమె స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాదు, సుర‌క్షా స‌హాయ్ పేరిట ఓ ప్రాజెక్టు ఏర్పాటు చేసి పేద మ‌హిళ‌ల ఆర్థిక ప్ర‌గ‌తికి, వారి పిల్ల‌ల చ‌దువుకు స‌హ‌కారం అందిస్తోంది. అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతూ పోలీసు కేసుల్లో చిక్కుకుని బ‌య‌ట‌కు వ‌చ్చే మ‌హిళ‌ల‌కు తోడ్పాటును అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అలా మంజిత ఓ వైపు పోలీస్ అధికారిణిగా రాణిస్తూనే, మ‌రో వైపు స‌మాజ సేవ‌లోనూ ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ఇందుకు గాను ఆమెను మ‌నం నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top