ఆయ‌న డాక్ట‌రే కాదు… పేద‌ల‌ను ఆదుకునే స‌మాజ సేవ‌కుడు కూడా..!

స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు ఏ ప‌నైనా చేయాలంటే దాని వ‌ల్ల ఏం వ‌స్తుంద‌నే ఆశిస్తారు. ఏదో ఒక లాభం ఉండ‌నిదే ఎవరూ ఏ ప‌ని చేయ‌రు. కానీ ఏ లాభం, ఫలితం ఆశించ‌కుండా, కేవ‌లం ఇత‌రుల బాగు కోస‌మే ప‌నిచేసే వారు స‌మాజంలో కొంద‌రే ఉంటారు. వారిని స‌మాజ సేవ‌కులు, సంఘ సంస్క‌ర్త‌లు అంటారు. అయితే వారు ఆ మాట‌ల కోసం ప‌నిచేయ‌రు. ఎందుకంటే వారు త‌మ బాగు క‌న్నా పేద‌లు, స‌హాయార్థుల బాగులోనే ఎక్కువ సంతృప్తిని పొందుతారు. కాబ‌ట్టే వారి నిరంత‌ర ల‌క్ష్యం ఒక్క‌టే ఉంటుంది. అదే స‌మాజ సేవ‌. అలాంటి సేవ చేసే వారిలో ఆ వ్య‌క్తి కూడా ఒక‌రు. ఆయ‌నే డాక్ట‌ర్ రామ‌శేష‌య్య అల్లా.

doctor-rama-sesaiah

డాక్ట‌ర్ రామ‌శేష‌య్య అల్లాది న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌. డాక్ట‌ర్‌గా ఆయ‌న ఎన్నో సంవ‌త్స‌రాల కింద‌టే ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. అయినా ఆయ‌న ఆ వృత్తికే అంకితం కాలేదు. స‌మాజం కోసం ఏదైనా చేయాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తాను చ‌దివిన కంటి వైద్యం కోర్సుతో అనేక మంది పేద‌ల క‌ళ్ల‌లో వెలుగులు నింపేందుకు నడుం బిగించారు. అలా ఆయ‌న గ‌త 18 ఏళ్లుగా ఎన్నో ప్రాంతాల‌కు చెందిన పేద‌ల‌కు ఉచితంగా కంటి ఆప‌రేష‌న్లు చేయించారు. అయితే ఆయ‌న సేవ అంత‌టితో ఆగ‌లేదు.

సాధార‌ణ మాన‌వుడికి అత్యంత అవ‌స‌రం అయిన వాటిలో దుస్తులు కూడా ఒక‌టి. అయితే పేద‌ల‌కు మాత్రం స‌రైన దుస్తులు ఉండ‌వు. ఈ క్ర‌మంలోనే ఆ విష‌యంపై డాక్ట‌ర్ రామ‌శేష‌య్య దృష్టి సారించారు. పేద‌ల‌కు బ‌ట్ట‌ల‌ను అంద‌జేయడం కోసం ఆయ‌న సొంతంగా అజ‌య్ జ్యోతి ట్ర‌స్టును ఏర్పాటు చేశారు. అనంత‌రం స్థానికంగా ఓ షెట‌ర్‌లో తన ట్ర‌స్టుకు చెందిన ప‌నులు చేయ‌డం మొద‌లు పెట్టారు. అందులో భాగంగా ఆయ‌న దాత‌ల నుంచి దుస్తుల‌ను సేక‌రించ‌డం మొద‌లు పెట్టారు. అలా సేక‌రించిన దుస్తుల‌ను పేద‌ల‌కు ఉచితంగా ఇవ్వ‌డం ఆయ‌న ప్రారంభించారు. అంతే కాదు, దాత‌లు స్వ‌చ్ఛందంగా ఇచ్చే ఉప‌యోగం లేని పాద‌ర‌క్ష‌లు త‌దిత‌ర వ‌స్తువుల‌ను కూడా డాక్ట‌ర్ రామ‌శేష‌య్య సేక‌రించి పేద‌ల‌కు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. అలా ఆయన ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది పేద‌ల‌కు స‌హాయం చేశారు. అయితే ఇప్ప‌టికీ ఆయ‌న ఓ వైపు డాక్ట‌ర్‌గా సేవ‌లందిస్తూనే మ‌రో వైపు త‌న వంతు బాధ్య‌తగా స‌మాజ సేవ‌ను కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని నిజంగా మ‌నం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top