ఇంటర్వ్యూయర్ అలసిపోయుందని…ఆ కాండిడేట్ అతిగా చేసి, ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చాడు..! తర్వాత ఏమైంది.?

”అది వెల్లూర్‌. కంపెనీ విప్రో. ఇంట‌ర్వ్యూ చేస్తోంది ఓ లేడీ హెచ్ఆర్‌. నేను ఆవిడ రూంలో కూర్చుని ఉన్నా. అప్పుడే ఆమె రూంలోకి ఎంట‌ర్ అయింది. వ‌చ్చి ఆమె కుర్చీలో కూర్చుంది. ఆమె ముఖాన్ని చూశా. బాగా అల‌సిపోయిన‌ట్టు క‌నిపించింది. నాకు ఎదురుగా టేబుల్‌పై వాట‌ర్ బాటిల్ క‌నిపించింది. వెంట‌నే దాన్ని చేతిలోకి తీసుకుని.. మంచి నీళ్లు తాగండి, అని ఆమెకు వాట‌ర్ బాటిల్ ఇచ్చా. ఆమె వాట‌ర్ బాటిల్ తీసుకుంది. అందులోంచి నీటిని ఒక గుట‌క వేస్తూ తాగింది. కొంత సేపు కళ్లు మూసుకుంది.

అప్పుడే నేనన్నా.. మేడ‌మ్‌, మీరు బాగా అల‌సిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నార‌ని. అందుకు ఆమె బ‌దులిస్తూ.. అవును, రోజంతా ఇంట‌ర్వ్యూలే. అందుకే అల‌సిపోయా.. అని చెప్పింది. నాకు తెలిసి మీరు ఈ రోజు ఇంటికి వెళ్లేలా క‌నిపించ‌డం లేదు అన్నా (టైం అప్ప‌టికే రాత్రి 9 అయింది). అలా ఏం లేదు, యాక్చువ‌ల్‌గా మాది కోయంబ‌త్తూర్‌. నాకు 3 నెల‌ల పాప ఉంది. నిన్న‌నే నా పాప‌ను, భ‌ర్త‌ను క‌లిసి వచ్చా. కానీ నా పాప‌ను మిస్ అవుతున్నా అని నాక‌నిప‌స్తోంది.. అని ఆమె చెప్పింది. డోన్ట్ వర్రీ మేడమ్‌, మీరు మీ పాపను క‌చ్చితంగా త్వ‌రలోనే క‌లుస్తారు, నేను 2200 కిలోమీట‌ర్ల దూరం నుంచి నా ఇల్లు వ‌దిలి ఇక్కడికి ఇంట‌ర్వ్యూకు వ‌చ్చా.. అని అన్నా.

అందుకు ఆమె న‌వ్వుతూ.. నేను నీ ఇంట‌ర్వ్యూయ‌ర్‌ని. నీ ఫ్రెండ్‌ని కాదు.. అంది. ఫ‌ర్వాలేదు మేడ‌మ్‌, మీరు నాకు ఫ్రెండ్ అవుదామ‌న్నా నేనేమీ అనుకోను.. అన్నా. మ‌ళ్లీ ఆమే న‌వ్వుతూ.. నీ గురించి చెప్పు అని అడిగే స‌రికి నా వివ‌రాలు మొత్తం చెప్పేశా. అప్పుడామె.. నీకు ఈ జాబ్ ఎందుకు కావాలి ? అని అడిగింది. అప్పుడు నేను.. నాకు డ‌బ్బు కావాలి, మీకు మంచి ఉద్యోగి కావాలి.. అని చెప్పా. అందుకు ఆమె నుంచి స‌మాధానం రాలేదు. కానీ మ‌ళ్లీ ఆమె న‌వ్వింది. అంతే.. ఇక నా ఇంట‌ర్వ్యూ పోయింది, అనుకున్నా. కానీ.. రిజ‌ల్ట్ డే రోజు తెలిసింది, నాకు విప్రోలో జాబ్ వ‌చ్చిందని..!”

— నిశాంత్ కుమార్ అనే వ్య‌క్తికి జాబ్ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఎదురైన ఘ‌ట‌నే ఇది. రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top