ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై మైన‌ర్ బాలిక బ‌ట్ట‌లూడ‌దీసి అత్యాచారానికి య‌త్నించారు ఆ నీచులు..!

మైన‌ర్ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌ను నిరోధించ‌డానికి, ఆ ఘ‌ట‌న‌లకు పాల్ప‌డే వారికి క‌ఠిన శిక్ష‌లు వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే పోక్సో చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడులు ఆగ‌డం లేదు స‌రిక‌దా మృగాళ్లు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. తాజాగా మ‌రో మైన‌ర్ బాలిక‌పై కొంద‌రు టీనేజీ యువ‌కులు దారుణానికి ఒడిగ‌ట్టారు. ఆమెను ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డులో అడ్డుకుని బ‌ట్ట‌లూడ‌దీసేందుకు య‌త్నించారు. అనంత‌రం ఆమె ప‌రిగెడుతున్నా ఆమె వెంట ప‌డి అత్యాచారం చేసేందుకు య‌త్నించారు. దీంతో ఈ ఘ‌ట‌న ఇప్పుడు దుమారం రేపుతోంది.

బీహార్ రాష్ట్రంలోని జెహానాబాద్ ప‌ట్ట‌ణంలో ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై ఆరుగురు యువ‌కులు ఓ మైన‌ర్ బాలిక‌పై దాడి చేశారు. ప‌ట్ట‌ణం శివారు ప్రాంతంలో ఓ రోడ్డుపై ఆమెను అడ్డ‌గించి అనంత‌రం దాడికి పాల్ప‌డ్డారు. ఆ బాలిక‌ను కింద ప‌డేసి తీవ్రంగా కొట్టారు. దీంతోపాటు ఆమె దుస్తులు విప్ప‌డానికి య‌త్నించారు. అయితే ఆ బాలిక వ‌ద్దు.. మీకు దండం పెడతానంటూ ఆ యువ‌కుల‌ను బ‌తిమాలింది. అయినా ఆ మృగాళ్లు విన‌లేదు. ఈ క్ర‌మంలో ఆమెకు, వారికి పెనుగులాట జ‌రగ్గా ఆమె దుస్తులు చిరిగిపోయాయి. అనంత‌రం ఆమె అక్క‌డి నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రిగెత్తింది. అయినా వ‌ద‌ల‌కుండా ఆ యువ‌కులు కూడా ఆమె వెంట ప‌రిగెత్తారు.

 

Watch Video :

అలా ఆ బాలిక వెంట ప‌రిగెత్తిన వారు ఆమెను అడ్డ‌గించి అత్యాచారం చేసేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆ ఆరుగురిలో ఒక‌డు ఆమె వీడియోను తీసి నెట్‌లో పెట్టాడు. దీంతో ఈ ఘ‌ట‌న పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై బీహార్ సీనియర్ ఐపీఎస్ అధికారి నయ్యర్ హస్నన్ వెంటనే స్పందించారు. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. వీడియోలో రికార్డ్ అయిన వాహనం నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు యువకుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే ఆ బాలికతో ఉన్న విబేధాల వల్లే ఆ యువ‌కులు ఇలా ప్రవర్తించార‌ని పోలీసులు చెప్పారు. వారిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఆ బాలిక‌పై కిరాత‌కంగా దాడి చేసి, ఆమెను వివ‌స్త్ర‌ను చేసి ప‌రిగెత్తించిన ఆ నీచుల‌కు ఉరి శిక్ష వేయాల్సిందే..!

 

Comments

comments

Share this post

scroll to top