ఈ 4 ఫోటోలు చూడండి.! 19వ శ‌తాబ్దంలోని ఇండియాను రిప్రెజెంట్ చేస్తాయి.

ఫోటో నెంబ‌ర్ 1:  నవ్వు తెప్పిస్తున్న‌ప్ప‌టికీ…ఈ ఫోటో క‌నిపిస్తున్న సీన్ వెనుక ఓ మంచి రీజ‌న్ ఉంది. చ‌దువుకునే స‌మ‌యంలో మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీకి చెందిన స్టూడెంట్స్ త‌మ పిల‌క‌ల‌ను ఇలా గోడ‌ల‌కు క‌ట్టిఉంచేవార‌ట‌.! దీని వ‌ల‌న వాళ్ల‌కు చ‌దువుకునే టైమ్ లో నిద్ర రాకుండా….ఎప్పుడూ అల‌ర్ట్ గా ఉండేలా చూసుకునేందుకు చేసిన చిన్న‌ ఏర్పాట‌న్నమాట ఇది.!! ఇప్పుడు చేతుల‌కు ర‌బ్బ‌ర్ బ్యాండ్ పెట్టుకొని నిద్ర‌వ‌చ్చే టైమ్ లో దాన్ని లాగి వ‌దులుతున్నారు. దీని ద్వారా మ‌న అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ కాకుండా ఉంటుంద‌న్న మాట‌.!

ఫోటో నెంబ‌ర్ 2: 1940 లో అంబులెన్స్ లు ..

ఫోటో నెంబ‌ర్ 3: మ‌హాత్మాగాంధీకి చెందిన 1938 నాటి వ‌స్తువులు… ఇప్ప‌టికీ వీటిని స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో చూడ‌వ‌చ్చు. అప్ప‌టి గాంధీజీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చి గాంధీజీకి సంబంధించిన వ‌స్తువులు ఇందులో ఉంచారు.

ఫోటో నెంబ‌ర్ 4. : బ్రిటీష్ కాలంలో రైలు కు ఆజ్యం పోసిన తోపుడు రైలు.!

రాజుల కాలంలో… రాజులు, అధికారులు…ఒక ఊరి నుండి మ‌రో ఊరికి వెళ్ళాలంటే ప‌ల్ల‌కీల్లో, గుర్రాల‌పైనో వెళ్లేవారు. బ్రిటీష్ కాలం వ‌చ్చే స‌రికి..ఇలాంటి కొత్త టెక్నిక్స్ ను ఇక్క‌డ ఇంప్లిమెంట్ చేశారు. స్టార్టింగ్ లో రైల్వే ట్రాక్ వేసి..ఒక బ‌గ్గీని దాని మీద ఉంచి…వెనుక నుండి కొంత మంది చేత తోయించుకుంటూ అధికారులు ఇత‌ర ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేవార‌న్న మాట‌.! త‌ర్వాత ఇదే రైల్వే వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసింది.

 

Comments

comments

Share this post

scroll to top