బీర్ ఏరులై పారిందంట!!!

ఈ వేసవి  తెలుగు రాష్ట్రాలకు మంచి కిక్కునిచ్చిందంట….  సన్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మన మందు బాబులు మాత్రం కింగ్ ఫిషర్,నాక్ అవుట్ అంటూ బీర్ బాటిల్స్ ను పెగ్గుల మీద పెగ్గులు లాగించేశారట!!!    గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బీర్ల అమ్మకాల మోత మోగుతుందంట. ఈ సమ్మర్ సీజన్ ల్ బీర్ల  అమ్మకాలను రికార్డు స్థాయికి చేర్చాయట. మే నెల చివరి  వరకూ తెలంగాణలో 27 లక్షల కేసులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెల మొత్తంలో 21 లక్షల కేసులు అమ్ముడు పోయాయని అధికారులు రికార్డుల్లో నమొదు చేశారు. ఇక వేసవి పూర్తేలోగా  35 లక్షల కేసుల వరకూ విక్రయాలు జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కేసులో 12 బీరు సీసాలు, 7.8 లీటర్ల బీరు ఉంటుంది.

friends clinking glasses in pub

friends clinking glasses in pub

ఈ లెక్కన ఈ నెలలో 2.10 కోట్ల లీటర్ల బీరు మార్కెట్లోకి పారినట్టే! ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 8,200 కేసుల బీరు విక్రయాలు సాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలో రోజుకు సగటున 10,400 కేసులు, ఏప్రిల్ లో 13 వేల కేసులు అమ్ముడుకాగా, మేలో ఏకంగా రోజుకు 18 వేల కేసుల అమ్మకాలు సాగుతున్నాయి. బీర్లకు గిరాకీ పెరగడంతో తమకు మార్జిన్లు అధికంగా లభించే కంపెనీల బీర్లను అమ్ముతున్న మద్యం దుకాణదారులు బ్రాండెడ్ బీర్ల కొరతను చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top