త‌న B.Com చదువు పై వివ‌రణ ఇచ్చిన MLA,ఇది కూడా ఫ‌న్నీనే.!

B.Com లో మ్యాథ్స్, ఫిజిక్స్ చ‌దివాన‌ని చెప్పి, రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న త‌న వీడియో పై….ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వివ‌ర‌ణ ఇచ్చారు. కాక‌పోతే…మ‌ళ్లీ అదే క్యాసెట్ వేశారు. నేను చ‌దివింది బీకామ్ కాద‌ని, నేను చ‌ద‌వాల‌నుకున్నది బీకామ్ అని వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఎన్నిక‌ల క‌మీష‌న్ కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో కూడా మెట్రిక్యులేష‌న్ చ‌దివాన‌ని చెప్పాన‌ని తెలియ‌జేశారు జ‌లీల్ ఖాన్. చిన్న‌ప్ప‌టి నుండి మ్యాథ్స్ లో వంద‌కు వంద వ‌చ్చిన‌వి అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు….మెట్రిక్యులేష‌న్ సెకెండ్ క్లాస్ లో పాస‌య్యాన‌ని చెప్పారు. ముందు చెప్పింది క‌ట్ చేసి, త‌ర్వాత చెప్పిన దానిని హైలెట్ చేశార‌ని ఆరోపించారు.

కాక‌పోతే..వివ‌ర‌ణ పేరుతో ఇచ్చిన వీడియో కూడా మ‌రింత ఫ‌న్నీగా ఉండ‌డంతో మ‌రోమారు సోషల్ మీడియా షేరింగ్ కి బ‌ల‌వుతున్నారు స‌ద‌రు ఎమ్మెల్యే గారు.

వివ‌ర‌ణ పేరుతో ఇచ్చిన వీడియో:

 

ఇంత‌కు ముందిచ్చిన ఇంట‌ర్వ్యూ:

Comments

comments

Share this post

scroll to top