అడ‌వి జీవితం కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వ‌దిలి వెళ్లాడు ఆ వ్య‌క్తి..!

చుట్టూ ఎటు చూసినా ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం. నిద్ర‌లేస్తూనే వినిపించే ప‌క్షుల కిల‌కిల‌లు. 24 గంట‌లూ ఒంటిని తాకే చ‌ల్ల‌ని, ప్ర‌కృతి సిద్ధ‌మైన పైర గాలి. స‌హ‌జ సిద్ధంగా పండిన కూర‌గాయల‌తో భోజ‌నం, మ‌ట్టితో నిర్మించిన నివాసం… వెర‌సి చ‌క్క‌ని అర‌ణ్యాన్ని త‌ల‌పించే వాతావ‌ర‌ణంలో నివ‌సించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఎవ‌రైనా అలాంటి ప్ర‌దేశంలో ఉండాల‌ని క‌చ్చితంగా కోరుకుంటారు. అయితే దాన్ని అంద‌రూ పూర్తి చేసుకోలేరు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం అలా కాదు. అలాంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్క‌ని వాతావ‌ర‌ణంలో నివ‌సించాల‌ని అనుకుని అలాగే చేశాడు. తానే కాదు, త‌న బంధువుల‌కే చెందిన మ‌రో 14 కుటుంబాల‌తో క‌లిసి ఏకంగా ఓ చిన్న‌పాటి అడ‌విని సృష్టించి అందులో నివ‌సిస్తున్నాడు. చేస్తున్న ఉద్యోగాన్ని వ‌ద‌లి, పిల్ల‌ల్ని స్కూల్ మాన్పించి మ‌రీ చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ప్ర‌శాంతంగా జీవిస్తున్నాడు ఆ వ్య‌క్తి.

mohan-chavara-1

అత‌ని పేరు మోహన్ చ‌వ‌ర‌. భార్య పేరు రుక్మిణి. అత‌నికి ఇద‌ర్దు కూతుళ్లు శ్రేయ‌, సూర్య‌. ఒక‌ప్పుడు ఉన్న‌ది కాంక్రీట్ జంగ‌ల్ లాంటి న‌గ‌రంలో. వృత్తి ప‌రంగా మోహ‌న్ మంచి శిల్పి. రుక్మిణి ఓ పాఠ‌శాల‌లో ప్ర‌ధానోపాధ్యాయురాలు. వారి కూతుళ్లిద్ద‌రూ స్కూల్‌లో చ‌దువుకునేవారు. అయితే మోహ‌న్‌కు ఏమ‌నిపించిందో ఏమో గానీ ఒక్క‌సారిగా న‌గ‌ర జీవితంపై విర‌క్తి క‌లిగింది. నిత్యం కాలుష్యం న‌డుమ జీవిస్తూ, అనారోగ్యాల బారిన ప‌డుతూ, కృత్రిమంగా పండించిన కూర‌గాయ‌ల‌ను తిన‌డం అత‌నికి ఎందుక‌నో న‌చ్చలేదు. దీంతో న‌గ‌ర జీవితాన్ని వ‌దిలి అడ‌వి లాంటి ప్రాంతంలో నివాసం ఉండాల‌నుకున్నాడు. అందుకోసం త‌న బంధువులను కూడా ఒప్పించాడు. మొత్తం వారివి 14 కుటుంబాల‌య్యాయి. వారంతా క‌లిసి ఓ ప్రాంతంలోని రెండున్న‌ర ఎక‌రాలను కొనుగోలు చేశారు. అందులో మొక్క‌లు నాటడం మొద‌లు పెట్టారు. అక్క‌డే మ‌ట్టితో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తిండికి స‌హ‌జ సిద్ధంగా కూర‌గాయ‌ల‌ను పండించే వారు. అలా క్ర‌మ క్ర‌మంగా వారు ఉంటున్న ప్ర‌దేశం చిన్న‌పాటి అడ‌విలా త‌యారైంది. దీంతో మోహ‌న్ ఆశించిన‌ట్టుగా ఒక చ‌క్క‌ని ప్ర‌కృతి వాతావ‌రణం సిద్ధ‌మైపోయింది.

mohan-chavara-3

mohan-chavara-2

అయితే నిజానికి అక్క‌డ ఉంటున్న కుటుంబాల‌న్నీ పేరుకు 14 అయినా అంద‌రూ ఒకే చోట వండుకుని తింటారు. ఒక కమ్యూనిటీ హాల్‌ను కూడా ఏర్పాటు చేసుకోవ‌డంతో వారి శుభకార్యాలు కూడా అక్క‌డే జ‌రుగుతున్నాయి. ఒక‌వేళ ఎవ‌రైనా అతిథులు వ‌చ్చినా క‌మ్యూనిటీ హాల్‌లో నిర‌భ్యంత‌రంగా ఉండ‌వ‌చ్చు. అందులో వారికి కావ‌ల్సి అన్ని స‌దుపాయాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో మోహ‌న్‌, అతని బంధువుల‌కు తెలిసిన ఇత‌ర వ్య‌క్తులు అక్క‌డికి అప్పుడ‌ప్పుడు వెళ్లి వ‌స్తుంటారు కూడా. ఏది ఏమైనా… మోహ‌న్ లాంటి వ్య‌క్తులు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తారు క‌దా..! నిజ‌మే మ‌రి… కాంక్రీట్ జంగిల్ లాంటి న‌గ‌రంలో ఉండ‌డం ఎవ‌రికి న‌చ్చుతుంది చెప్పండి. కానీ బ‌తుకు పోరాటం కోసం త‌ప్ప‌దు క‌దా..! అన్న‌ట్టు, ఇంకో విష‌యం… మోహ‌న్ ఇప్పుడు ఉంటోంది ఎక్క‌డో తెలుసా..? కేర‌ళ‌లో..!

Comments

comments

Share this post

scroll to top