ట్రక్ డ్రైవర్ అజాగ్రత్తకు…ఫలితం ఇది. ఏ ట్రక్ డ్రైవరైనా అలా వెళుతుంటే చెప్పండి.

సహజంగా మనం రహదారిపై వెళ్తున్నప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేస్తాం. వారి దగ్గరికి పరిగెత్తి రక్షించేందుకు యత్నిస్తాం. ఇది మనకు జరిగినా కూడా ఇతరులు అలాగే వస్తారు. అయితే చైనాలో ఓ ఇరుకు రహదారిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వాహనదారులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎదురుగా వచ్చిన ఓ ట్రక్‌కు చెందిన డోర్ ప్రమాదవశాత్తూ తగిలి ద్విచక్ర వాహనం నుంచి కిందపడగా ఆ బాధితులకు సహాయం చేసేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. ప్రమాదాన్ని చూస్తూనే తాపీగా ఓ ఇద్దరు వ్యక్తులు నిలుచుని ఉన్నారు. కానీ వెంటనే సహాయం అందించలేదు. తమ పని తీరిగ్గా ముగించుకుని అప్పుడు బాధితుల కోసం వచ్చారు.

చైనాలోని గిజ్‌హో ప్రావిన్స్‌లో ఇరుకుగా ఉన్న ఓ రహదారిలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అదే సమయానికి వారికి ఎదురుగా ఓ ట్రక్కు వచ్చింది. అప్పుడు ఆ వీధిలో ఓ మహిళ తన జుట్టును సరి చేసుకుంటుండా ఓ వ్యక్తి తన పనిలో బిజీగా ఉన్నాడు. అయితే సరిగ్గా ట్రక్కు ఆ ద్విచక్రవాహనాన్ని దాటుకుని కొద్దిగా ముందుకు వెళ్లగానే దాని వెనక ఉన్న డోర్ అకస్మాత్తుగా బైక్‌పై ప్రయాణిస్తున్న వారికి తగిలింది. దీంతో వారు అక్కడికక్కడే కింద పడిపోయారు. అయితే ట్రక్ డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా ఆగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కనీసం ఆ వాహనదారులకు ఏం జరిగిందోనని కూడా చూడలేదు. అయితే అక్కడే వీధిలో పైన చెప్పిన ఓ మహిళ, ఓ వ్యక్తి మాత్రం ఈ యాక్సిడెంట్‌ను చూస్తూనే ఉన్నారు. ఆ వాహనదారులు కింద పడినా వెంటనే సహాయం అందించేందుకు వారి దగ్గరికి వెళ్లలేదు. తమ పనులను తాపీగా ముగించుకుని అప్పుడు వెళ్లారు. కాగా అదృష్టవశాత్తూ ఆ ముగ్గురు వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అయితే ఇలాంటి ప్రమాదాలు చైనాలో సర్వసాధారణమట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి ఏటా చైనాలో రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 2 లక్షల మంది వరకు చనిపోతున్నారు. గత దశాబ్ద కాలంలో చైనా రోడ్లపైకి 1.50 కోట్ల కార్లు కొత్తగా వచ్చాయట. అయితే ఎన్ని రంగాల్లో చైనా ముందున్నా తోటి వారికి సహాయం చేయడంలో మాత్రం వెనుకే అని ఈ ప్రమాదం రుజువు చేస్తోంది. ఇంకా మనమే బెటర్. రహదారిపై ప్రమాదం జరిగితే వెంటనే వెళ్లి వారిని ఆదుకుంటాం. కాగా పైన తెలిపిన సంఘటనకు చెందిన వీడియో అక్కడ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top