మహాభారతంలోని ఆసక్తికరమైన పది ప్రేమకథలు.!

మహాభారతంలో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధికెక్కినవి మరియు చాలా మందికి తెలిసినవి, ఎవ్వరికీ తెలియనివి మరికొన్ని ఉన్నాయి. మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఇందులో మనం ఒకవైపు ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తీ, నీతి కధలను చూస్తాం. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, అన్యాయాన్ని కూడా చూస్తాం.ఈ మహాభారత కథలో, కొన్ని వినని ప్రేమ కథలలో పాత్రల గురించి మనం తెలుసుకుందాం..

గాంధారి మరియు ధృతరాష్ట్రుడు:

కౌరవుల తల్లిదండ్రులు  గాంధారి మరియు ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమయ్యింది. గాంధారి, అతనిని కలుసుకున్నతరువాతే అతను గుడ్డివాడు అన్న విషయం తెలుసుకున్నది. ఆ తరువాతే ఆమె తన భర్త గుడ్డివాడని ఆమె కూడా ఆనందాన్ని త్యజించింది. ఆమె వైవాహిక జీవితం మొత్తం స్వచ్ఛందంగా ఆమె కళ్లకు గంతలు కట్టుకుని గడిపింది..నిజంగా ధృతరాష్ట్రుడిని ప్రేమించింది కాబట్టే జీవితాంతం భర్తతో పాటే తను కళ్లు లేనిదానిగా ఉండిపోయింది.


అర్జునుడు ఉలూపి:

ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లిపోవడం వినుంటారు కానీ ఉలూపి అర్ఝునున్ని అపహరించి తీస్కెళ్లిపోయింది.ఉలూపి ఒక నాగ యువరాణి . బ్రహ్మచర్యం యొక్క నియమాలను మరియు ఇతర మహిళలతో ఉన్న సంబంధం కాకుండా ద్రౌపదితో ఉన్న సంబంధం, వీటన్నిటిని అధిగమించి ఆమె అతనిని ఒప్పించింది. ఆమె తరువాత అతనికి నీటిలో ఉండగా ఎటువంటి హాని జరగదనే ఒక వరం ఇచ్చింది..

అర్జునుడు, చిత్రాంగద

కావేరి నది ఒడ్డున ఉన్న మణిపూర్ కు రాజు చిత్రవాహనుడు అతని కుమార్తె చిత్రాంగద, చాలా అందమైనది ఒకసారి మణిపూరి ని అర్జునుడు సందర్శించాడు.  అర్జునుడు చిత్రాంగథను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు.  ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు, ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్ లో పెరగాలని మరియు సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. అర్జునుడు అంగీకరించాడు. బబ్రువాహనుడు జన్మించిన తరువాత, అర్జునుడు భార్యను, కొడుకును వొదిలి తన సోదరులతో కలిసి ఉన్నాడు. చిత్రవాహనుడి మరణం తరువాత, బబృవాహనుడు మణిపూర్ రాజ్యానికి రాజయ్యాడు. మహాభారత యుద్ధం తరువాత, అర్జునుడు, తన కుమారుడు, బబృవాహనుడి చేతిలో పరాజయం పాలయ్యాడు.

.
సత్యవతి మరియు ఋషి పరాశరుడు

పరాశరుడు భక్తి ద్వారా అనేక యోగ శక్తులను పొందిన, ఒక గౌరవనీయుడైన గొప్ప ఋషి అని అందరికి తెలిసిన విషయమే. సత్యవతి, ఒక మత్స్యకారుడి కుమార్తె, ఆమె పడవలో ప్రజలను యమునా నదిని దాటిస్తుండేది. ఒక రోజు ఆమె పడవలో ఋషి పరాశరుడిని దాటిస్తున్నది. ఆ సమయంలో ఋషి ఆమె రూపానికి ఆకర్షితుడై, తన కోరికను వ్యక్తం చేశాడు. అతను ఆమెతో సంగమం వలన ఆమె ఒక గొప్ప వ్యక్తి జన్మకు కారణమౌతుందని చెప్పాడు. సత్యవతి అతనికి మూడు షరతులు పెట్టింది – 1. ఎవరూ వారు ఏమి చేస్తున్నారో చూడకూడదు, పరాశరుడి వారిద్దరి చుట్టూ ఒక కృత్రిమ పొగమంచు రూపొందించాడు; 2. తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలి – పరాశరుడు ఆమెకు, జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంటుందని హామీ ఇచ్చాడు ; 3. ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన బదులు సుగంధభరిత వాసన రావాలని కోరుకున్నది – పరాశరుడు ఆమె శరీరం నుండి తొమ్మిది మైళ్ళ దూరం వరకు ఒక దివ్య వాసన వొస్తుందని వాగ్దానం చేశాడు. వారి కలయిక వలన పుట్టిన వాడే వేదవ్యాసుడు.

సత్యవతి మరియు శంతనుడు:

సత్యవతి పరిమళం శంతనుడిని ఆకర్షించింది. అతను ఆ పరిమళం వొచ్చే దిశను అనుసరించాడు మరియు సత్యవతి పడవలో కూర్చొని ఉండటం చూశాడు. అతను పడవలోకి ఎక్కి నదిని దాటించమని సత్యవతిని కోరాడు. అతను ఆవలి ఒడ్డుకు చేరుకున్నతరువాత అతను తిరిగి పడవలోకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేర్చమని ఆమెను కోరాడు. ఈ విధంగా ఆ రోజు సంధ్యాసమయం వరకు కొనసాగింది. ఇదేవిధంగా కొంతకాలం రోజువారీ కొనసాగింది. చివరగా, శంతనుడు వివాహం చేసుకోమని సత్యవతిని కోరాడు. సత్యవతి తన అంగీకారం తెలిపింది కానీ ఆమె తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పింది. ఆమె తండ్రి పెట్టిన షరతులు విని శంతనుడు నిరాశ చెందాడు మరియు ఆ షరతులు తీర్చటానికి తను అశక్తుడినని తెలిపాడు.

హిడింబి మరియు భీముడు:

భీముడు, కుంతి కుమారుడు. హిడింబి నరభక్షకురాలు. ఆమె భీముడితో ప్రేమలో పడింది . అదే ప్రేమ ఆమెలో  ప్రతి మార్పును తెచ్చింది.. వివాహం తరువాత, వారు పరిమితమైన కాలం మాత్రమే కలిసి జీవించారు. అప్పుడు భీముడు ఆమెని వదిలి వెళ్లాడు. వీరిద్దరి కుమారుడే ఘటోత్కచుడు.భీముడి తనని వదిలి వెళ్లాక తల్లి మాత్రమే ఘటోత్కచుడి బాగోగులు చూసుకుంది

అర్జునుడు, సుభద్ర:

అర్జునుడు, సుభద్ర సోదరుడు శ్రీకృష్ణడుు  ద్రోణుడి వద్ద  శిక్షణ తీసుకున్నారు. అజ్ఞాతవాసం తరువాత, అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో అర్జునుడు సుభద్ర మందిరానికి ఆహ్వానింపబడ్డాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు అర్జునుడు శ్రీ కృష్ణుడిలో సగభాగం అయిన తన సోదరి అయిన సుభద్రను వివాహం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడే సుభద్రను అపహరించమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో ఆమె వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారు స్నేహపూర్వకంగా కలిసిన ఒక గంట తర్వాత , సుభద్ర ద్రౌపదికి వివాహ విషయం చెప్పింది మరియు ఆమె కూడా అంగీకరించింది..

రుక్మిణి మరియు శ్రీ కృష్ణ

శ్రీ కృష్ణుడు ఆమె కుటుంబం యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా రుక్మిణిని అపహరించి వివాహం చేసుకున్నాడు. అప్పటికి రుక్మిణి శ్రీకృష్ణుడు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.

ద్రౌపది మరియు పాండవులు

ద్రౌపది అయిదుగురు పాండవ సోదరులందరిని వివాహమాడింది. ఆమె, తనయొక్క ప్రతి భర్తపట్ల ప్రధాన నిబద్ధతను నిర్వహిస్తూ వచ్చింది. అది మాత్రమేకాదు, అందరు సోదరులు ద్రౌపది పట్ల న్యాయం చేయాలని విశ్వాసం కలిగి ఉన్నారు.

శ్రీ కృష్ణుడు మరియు అతని 16.108 భార్యలు:

16.108 భార్యలలో, 16,000 మంది అనేక సంవత్సరాలు వేచిఉన్న తరువాత అతడు వారిని వివాహం చేసుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top