పేరెంట్స్ ఏది చేస్తుంటారో.. అది చూసి పిల్లలు కూడా అవే పనులు చేస్తుంటారు. అందుకే మన ఇళ్ళలో ఎలాంటి ప్రమాదకర వస్తువులైనా పిల్లల కంటపడకుండా జాగ్రత్తగా ఉండేలా పక్కన పెట్టాలి. ఈ వీడియోలో ఉన్న బుడతడు కూడా ఓ చిన్న సాహసమే చేసి బెదిరిపోయాడు. తనకు అందేటటువంటి ఎత్తులో ఉన్న ప్లగ్ సాకెట్ దగ్గరకు వెళ్లి టేబుల్ ఫ్యాన్/ ఫ్లోర్ క్లీనర్ ప్లగ్ ను సాకెట్ లో ఉంచాడు. అప్పటికే స్విచ్ ఆన్ చేసి ఉంచడంతో, అది గిర్రుమని పెద్ద సౌండ్ చేస్తూ తిరిగింది. దీంతో ఒక్కసారిగా భయంతో పరుగుతీసి బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు. ప్రమాదమేమీ జరగపోయినా, చిన్న పిల్లలకు అందుబాటులో ఉండటం సమస్యే కదా. ఈ వీడియోని ఆ పిల్లవాడి తల్లిదండ్రులే అప్ లోడ్ చేశారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు.. జాగ్రత్త అని చెప్పడానికే.
Watch Video:
( Wait 3 Seconds For Video To Load)
This Kid Made my day better LOL
Posted by Israela Claro on Monday, October 26, 2015