ధోనీకి బీసీసీఐ షాక్..! కారణం “టెస్ట్ మ్యాచ్”ల నుండి రిటైర్ అవ్వడం.! అసలేమైంది అంటే.?

మ‌హేంద్ర సింగ్ ధోనీ… ఇండియ‌న్ క్రికెట్ టీంలో ధోనీ పాత్ర ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. కీల‌కంగా మారే, ఓడిపోయే మ్యాచ్‌ల‌ను కూడా గెలిపించ‌గ‌ల స‌త్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ప్ర‌స్తుతం అత‌ను టెస్ట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ వ‌న్డే, టీ20 మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాడు. ఇత‌ని కెప్టెన్సీలో ఇండియాకు 2007లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌, 2011 లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌భించాయి. మినీ వ‌ర‌ల్డ్ క‌ప్‌గా భావించే చాంపియ‌న్స్ ట్రోఫీని 2013లో భార‌త్ సాధించ‌డం వెనుక ధోనీ కృషి ఎంత‌గానో ఉంది. అయితే ఇంత ఘ‌న‌త ఉన్నా, ఇప్ప‌టికీ బాగానే ఆడుతున్నా.. సెలెక్ట‌ర్లు, బీసీసీఐ బోర్డు మాత్రం ధోనీకి ఇప్పుడు అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు. దీనికి తోడు ఇత‌నికి బీసీసీఐ త్వ‌ర‌లో మ‌రో షాక్ ఇవ్వ‌నుంది. అదేమిటంటే…

ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ ఏ, బీ, సీ అనే కేట‌గిరిల ప్ర‌కారం సంవ‌త్స‌రానికి వేత‌నాల‌ను చెల్లిస్తుంది. అవి వ‌న్డే, టీ20, టెస్ట్‌ల‌కు వేర్వేరుగా ఉంటాయి. ఏ కేట‌గిరిలో ఉన్న క్రీడాకారుల‌కు గరిష్ట మొత్తం పేమెంట్ అందుతుంది. అయితే ప్ర‌స్తుతం ధోనీ ఎ కేట‌గిరిలో ఉన్నాడు. కాగా తాజాగా కోహ్లి, ధోనీలు త‌మ జీతాల‌ను పెంచాల‌ని క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్ (సీవోఏ)కి తెలిపారు. అయితే వారి విన్న‌పాన్ని సీవోఏ ప‌ట్టించుకోలేదు. దీనికి తోడు ధోనీకి ఇప్పుడు పేమెంట్ త‌క్కువ‌గా చేసేందుకు యోచిస్తున్నారు.

బీసీసీఐ త్వ‌ర‌లో ఎ + అనే మ‌రో కొత్త కేటగిరిని తీసుకురానుంది. ఇందులో అన్ని ఫార్మాట్ల‌లో (వ‌న్డే, టీ20, టెస్ట్‌) ఆడే అత్యుత్త‌మ ప్లేయ‌ర్స్‌ను చేర్చాల‌ని బీసీసీఐ యోచిస్తోంది. అలా చేస్తే ధోనీ ఎ + కేటగిరిలో స్థానం కోల్పోతాడు. దీంతో అత‌నికి పేమెంట్ త‌క్కువ‌గా ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం ఎ కేట‌గిరిలోని ఆట‌గాళ్ల‌కు ఏడాదికి రూ.2 కోట్ల వేత‌నాన్ని ఇస్తున్నారు. అయితే ఎ + కేట‌గిరి తెస్తే వారికి రూ.2 కోట్ల‌ను ఇచ్చే అవ‌కాశం ఉంది. క‌నుక ఎ కేట‌గిరికి అంత‌క‌న్నా త‌క్కువ మొత్తం కేటాయిస్తారు. దీంతో ఎ కేట‌గిరిలో ఉండే ధోనికి త‌క్కువ పేమెంట్ అందుతుంది. ఇలా ధోనీకి బీసీసీఐ షాక్ ఇవ్వ‌నుంది. అయితే ఈ విష‌యంలో ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top