మిథాలీ సేన‌కు బీసీసీఐ న‌జ‌రానా… ఒక్కో క్రికెట‌ర్‌కు రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దు అంద‌జేత‌..!

ఇటీవ‌ల లండ‌న్‌లో జ‌రిగిన ఐసీసీ మ‌హిళల క్రికెట్ వ‌రల్డ్ క‌ప్‌లో ఇంగ్లండ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఏ విధంగా రాణించిందో అంద‌రికీ తెలిసిందే. 9 ప‌రుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయి ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన‌ప్ప‌టికీ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు చ‌క్క‌ని పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింద‌ని యావ‌త్ దేశ క్రికెట్ అభిమానులు ఇండియ‌న్ టీంను అభినందించారు. చాలా మంది వారికి అభినంద‌న‌లు తెలిపారు. మ్యాచ్ గెల‌వ‌క‌పోయినా, ఆటలో స‌త్తా చాటినందుకు వారికి అంద‌రి నుంచి ప్ర‌శంసలు ద‌క్కాయి. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ కూడా వారికి పెద్ద మొత్తంలో న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేసింది.

ఇటీవ‌లే జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స‌హా మొత్తం 15 మంది టీం స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికి రూ.50 ల‌క్ష‌ల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేశారు. అలాగే స్టాఫ్‌కు ఒక్కొక్క‌రికి రూ.25 ల‌క్ష‌లు అంద‌జేశారు. ఈ క్ర‌మంలో రైల్వే శాఖ వారు మిథాలీ సేన‌కు రూ.1 కోటి న‌జ‌రానాను ప్ర‌క‌టించారు. దీంతోపాటు ప్ర‌స్తుతం రైల్వేలో ప‌లు పోస్టుల్లో ఉన్న జ‌ట్టు స‌భ్యుల‌కు రైల్వే శాఖ ప‌దోన్న‌తిని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. జ‌ట్టు సార‌థి మిథాలీ రాజ్‌, వైస్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ల‌కు గెజిటెడ్ ఆఫీస‌ర్లుగా ప‌దోన్న‌తి ఇచ్చిన‌ట్టు రైల్వే అధికారులు వెల్ల‌డించారు.

ఇక హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.5లక్షల నజరానాను ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మిథాలీ సేనకు రూ.50లక్షలు ప్రకటించారు. అయితే జ‌ట్టు స‌భ్యుల‌కు బీసీసీఐ నుంచి రూ.50 ల‌క్ష‌లు కాకుండా రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇవ్వాల‌ని, అలాగే స్టాఫ్‌కు రూ.25 ల‌క్ష‌లు కాకుండా రూ.30 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బీసీసీఐకి చెందిన ప‌లువురు అడిగిన‌ట్టు తెలిసింది. కానీ బీసీసీఐ అలా కాకుండా జ‌ట్టు స‌భ్యుల‌కు ఒక్కొక్కరికి రూ.50 ల‌క్ష‌లు, స్టాఫ్‌కు ఒక్కొక్క‌రికి రూ.25 ల‌క్ష‌ల‌ను అంద‌జేసింది. అయితే పురుషుల జ‌ట్టుతో స‌మానంగా మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టుకు వేత‌నాలు అందించే యోచ‌న‌లో బీసీసీఐ ఉంద‌ట‌. ఏది ఏమైనా టీమిండియా మ‌హిళా క్రికెటర్ల‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌నే చెప్ప‌వ‌చ్చు..!

 

ఇదిలి ఉండ‌గా ఇండియ‌న్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ కు తెలంగాణ సిఎం కెసిఆర్ కోటి రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించారు. దానితో పాటు ఇంటిస్థ‌లాన్ని కూడా ఇవ్వ‌నున్నాడు.!

Comments

comments

Share this post

scroll to top