చూస్తున్నాం కదా అని ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారు.! ఐఐటీ రిసల్ట్ వెనక షాకింగ్ నిజం!

దేశ వ్యాప్తంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్ప‌టికే అనేక మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు అన్నీ దాదాపుగా అయిపోయాయి. ఇది రిజల్ట్స్ టైం. దీంతో అనేక మంది విద్యార్థులు త‌మ భ‌విష్య‌త్తు నిర్ణ‌యించుకునే ప‌నిలో ప‌డ్డారు. అయితే ప‌రీక్ష‌ల రిజ‌ల్ట్స్ రావ‌డం ఏమోగానీ టీవీల్లో మాత్రం.. కార్పొరేట్ కాలేజీల హోరు భ‌రించ‌లేక‌పోతున్నాం.. 1, 1, 2, 2, 4, 6, 8… అంటూ ఊక‌దంపుడు యాడ్స్‌తో వీక్ష‌కుల బుర్ర‌ల‌ను తొలిచేస్తున్నారు. దీంతో తెలుగు టీవీ చాన‌ల్స్ పెట్టాలంటేనే ఇబ్బందిగా మారింది. మ‌రీ తెలుగు న్యూస్ చాన‌ల్స్‌లో అయితే ఇలాంటి యాడ్‌ల‌కు కొదువే ఉండ‌డం లేదు.

అయితే టీవీ చానళ్ల‌లో వ‌స్తున్న కార్పొరేట్ కాలేజీ యాడ్స్ మాట అటుంచితే.. వాటిలో విశ్వ‌సనీయ‌త ఎంత ఉంది, నిజంగా వారు చెబుతున్న స్టూడెంట్స్‌కు అన్ని మార్కులు వ‌చ్చాయా ? వారు అంత మంచి ర్యాంకులు సాధించారా ? అనే అంద‌రికీ అనిపిస్తుంది. అయితే అందులో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే స‌ద‌రు కాలేజీలు ఆడుతున్న‌ది పెద్ద డ్రామా. ఎవరో స్టూడెంట్స్ కు మంచి ర్యాంకులు వ‌స్తే వారికి డ‌బ్బిచ్చి మేనేజ్‌చేసి త‌మ కాలేజీలో చ‌దివినందునే అంత మంచి ర్యాంకు వచ్చంద‌ని చెప్పుకుంటున్నాయి. ఏంటీ న‌మ్మ‌లేరా..? కావాలంటే ఈ పోస్టులో ఇచ్చిన చిత్రంలో చూడండి.

జీఈఈ మెయిన్ ఫ‌లితాల్లో భోగి సూర‌జ్ కృష్ణ అనే విద్యార్థికి ఫ‌స్టు ర్యాంకు వ‌చ్చింద‌ని, అత‌ను త‌మ విద్యార్థి అని శ్రీ‌చైత‌న్య కాలేజీ ఓ యాడ్‌ను తాజాగా వేసుకుంది. అయితే చిత్రంగా మ‌రో వైపు నారాయ‌ణ కాలేజీ కూడా అదే విద్యార్థి ఫొటోను ప్రింట్ చేసి అత‌ను త‌మ కాలేజీ వాడ‌ని, త‌మ కాలేజీలో చ‌దివినందునే స‌ద‌రు విద్యార్థికి మొద‌టి ర్యాంకు వ‌చ్చింద‌ని ఆ కాలేజీ కూడా యాడ్ వేసుకుంది. కాక‌పోతే ఆ విద్యార్థి ఇంటి పేరు భోగికి బ‌దులుగా బి అని షార్ట్‌క‌ట్‌లో పేరు పెట్టారు. మిగిలిన పేరును అలాగే ఉంచారు. క‌నుక ఈ రెండు యాడ్స్‌ను చూస్తే.. మేం పైన చెప్పిన ఆ విష‌యం నిజ‌మేన‌నిపిస్తుంది క‌దా. అస‌లు నిజంగా పైన చెప్పిన ఆ విద్యార్థి ఏ కాలేజీలో చ‌దివాడ‌నే డౌట్ ఇప్పుడు మీకు కూడా వ‌స్తుంది క‌దా..! అవును, కార్పొరేట్ కాలేజీలు చేసే మాయ అదే క‌దా..! అందుకే చాలా మంది వారి వ‌ల‌లో ప‌డుతుంటారు. క‌నుక ఇప్ప‌టికైనా మేల్కొంటే మంచిది. లేదంటే ల‌క్ష‌ల రూపాయ‌ల డ‌బ్బును అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది.

Comments

comments

Share this post

scroll to top