బట్టలుతుకుతా అని చెల్లికి చెప్పేళ్లింది ఆ ఇంటర్ విద్యార్థిని…చివరికి ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి..!

లవ్ ఫెయిల్ అయినా ఆత్మహత్య,చదువులో వెనుక పడిన ఆత్మహత్య..ప్రతి చిన్నకష్టానికి ఆత్మహత్య..ఈ భూమ్మీద బతికే దైర్యం లేక చావుని ఆశ్రయిస్తున్న ఏకైక జీవి మనిషే..ఈ మధ్య కాలంలో చదువుల ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది విధ్యార్దులు ఆత్మహత్య చేసుకున్నారు.శ్రావణి అనే అమ్మాయి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది…ఆ వివరాలు..
పల్లపు పాండు దంపతుల పెద్ద కూతురు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాధన్నపేట్ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతుంది..శ్రావణి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చంద్రయ్యహట్స్‌లో నివసిస్తున్నారు. శ్రావణి కి ఒక చెల్లె,తమ్ముడు ఉన్నారు..సైదాబాద్‌ వినయ్‌నగర్‌కాలనీలోని సంఘం లక్ష్మీబాయి జూనియర్‌ కాలేజ్ లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(సీఈసీ) చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజ్ నుంచి శ్రావణి తన చెల్లెలు ప్రియాంకతో కలిసి ఇంటికి వచ్చింది.ప్రియాంక ఆ చుట్టుపక్కన ఉన్న స్కూల్లోనే ఎనిమిదోతరగతి చదువుతుంది.ఇంటికి వచ్చాకా బట్టలు  ఉతుకుతానని చెల్లికి చెప్పి బాత్రూమ్‌లోకి వెళ్లింది శ్రావణి.లోపలికి వెళ్లి గొల్లెం పెట్టుకుని శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకుంది.
మంటలకు తాళలేక శ్రావణి కేకలు వేయడంతో… చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే శ్రావణి చనిపోయింది.. సమాచారం అందున్న మాదన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదువులో వెనుకపడినందుకా,ప్రేమ విఫలమైనందుకా,మరే ఇతర కారణం చేత శ్రావణి ఆత్మహత్య చేసుకుందనేది ఇంకా తెలియలేదు..

Comments

comments

Share this post

scroll to top