ట్రీట్మెంట్ కు 50 లక్షలు అడిగారు…బతుకుండగానే చిన్నారిని చనిపోయాడని సంచిలో ప్యాక్ చేసి ఇచ్చారు..!

నేటి తరుణంలో మన దేశంలో పేదలకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో అందరికీ తెలిసిందే. డాక్టర్లు సరిగ్గా ఉండరు. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారు. సదుపాయాలు అసలే ఉండవు. కంపు కొట్టే పరిసరాలతో ప్రభుత్వ హాస్పిటల్స్‌ దారుణంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాటి పరిస్థితి అలాగే ఉంది కానీ వాటిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో జనాలు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రైవేటు హాస్పిటల్స్‌ బాట పడుతున్నారు. అయితే అక్కడ కార్పొరేట్‌ సంస్థలు ఉండడంతో వారు జనాల దగ్గర డబ్బును గుంజుతున్నారు. చిన్నపాటి అనారోగ్యానికే ఎక్కువ టెస్టులు చేయడం, అవసరం లేకున్నా ఖరీదైన మందులు రాయడం, దీనికి తోడు ఆ ఫీజు, ఈ ఫీజు అని చెప్పి ఎక్కువ డబ్బులు గుంజడం నేడు ప్రైవేటు హాస్పిటల్స్‌ వారికి కామన్‌ అయిపోయింది. దీంతో అడపా దడపా వారు చేసే నీచపు పనులు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే…

ఢిల్లీలో మాక్స్‌ హాస్పిటల్‌ అని ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌ ఉంది. అక్కడ ఈ మధ్యే ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరూ చనిపోయారని చెప్పి హాస్పిటల్‌ వారు ఆ పసికందును ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో చుట్టి వారి తల్లిదండ్రులకు వారి మృతదేహాలను అప్పగించారు. దీంతో శోక సముద్రంలో ఉన్న వారు ఆ పసికందులను తీసుకుని శ్మశానానికి వెళ్లారు. అయితే మార్గ మధ్యలో వారిలో ఒక శిశువు కదలడం మొదలు పెట్టాడు. దీంతో వారు ఆ శిశువును వెనక్కి తీసుకువచ్చి హాస్పిటల్‌ వారిని నిలదీశారు. శిశువుకు వైద్యం అందించాలని అడిగారు.

అయితే హాస్పిటల్‌ వారు ఆ శిశువుకు వైద్యం అందించేందుకు రూ.50 లక్షలను డిమాండ్‌ చేశారు. అంతే కాదు, సదరు పిల్లలను కన్న మహిళకు కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని అందుకు మరో రూ.35వేలు సర్జరీ కోసం అవుతాయని చెప్పారు. దీంతో ఆ పసికందు కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీసులకు హాస్పిటల్‌ వర్గాలపై కంప్లెయింట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే నిజానికి ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడిని ఆస్పత్రి సిబ్బంది సరిగ్గా చెక్‌ చేయలేదట. దీంతో చెక్‌ చేయకుండానే ఆ పసికందు చనిపోయాడని నిర్దారించి వారి ఇద్దరినీ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదీ.. ఆ హాస్పిటల్‌ వారు చేసిన నిర్లక్ష్యం. పైగా బతికే ఉన్న పసికందును తీసుకువచ్చి చికిత్స అందించమన్నందుకు రూ.50 లక్షలట. నిజంగా ఇలాంటి హాస్పిటల్స్‌ ఉంటే అప్పుడు జనాలకు ఇక వైద్యం ఎలా అందుతుంది..!

Comments

comments

Share this post

scroll to top