టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములుండే ప్లేస్ లు…వీటితో కాస్త జాగ్రత్త…లేదంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే.

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అధిక శాతం వ్యాప్తి చెందుతున్న అనారోగ్యాల్లో ఎక్కువగా పరిశుభ్రత లేమి వల్ల వస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అయితే వీటిలో ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయట. ఈ క్రమంలో మనం నిత్యం ఎక్కువగా వాడే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోజూ మనం ఆయా సందర్భాల్లో చేతులను ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి, వాటికి క్రిములు ఎక్కువగా అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ క్రిములు ఎలాంటి ప్రదేశాల్లో అధికంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్క విషయం, ఇప్పుడు చెప్పబోయే ఆయా ప్రదేశాల్లో మాత్రం టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉంటాయట.
కంప్యూటర్ కీబోర్డు… 
టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉండే ప్రదేశాల్లో కంప్యూటర్ కీబోర్డు కూడా ఒకటి. నేడు అధిక శాతం మంది కంప్యూటర్ల పైనే పనిచేస్తున్న నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా ఉంది. లేదంటే అనేక రకాల వ్యాధులకు, ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
u5s94setvwavay08iq3p
డబ్బు… 
మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైంది డబ్బు. ప్రధానంగా కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ప్రతి నోటుపై కొన్ని కోట్లాది క్రిములు ఉంటాయి. ఈ క్రమంలో డబ్బులను ముట్టుకున్నా, లెక్కించినా కచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే.
15qti1vyvpow2zbwye3w
స్విమ్మింగ్ పూల్… 
స్విమ్మింగ్ పూల్స్‌లోనూ కోట్లాది క్రిములు ఉంటాయి. బాగా శుభ్రం చేసిన నీరు ఉంటేనే అందులోకి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు.
కార్డ్ రీడర్… 
క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసేందుకు ఉపయోగించే కార్డ్ రీడర్‌లకు కూడా ఎక్కువగా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని వాడితే కచ్చితంగా చేతులను కడుక్కోవాలి.
మొబైల్ ఫోన్… 
నేటి తరుణంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే వీటికి కూడా సూక్ష్మ క్రిములు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా డివైస్ స్క్రీన్‌పై ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి మొబైల్స్‌ను వాడినప్పుడు కూడా శుభ్రత పాటించాల్సిందే.
xhcdbyl8xxasxpl6izjf
సినిమా హాళ్లు… 
నిత్యం కొన్ని వందల మంది అభిమానులు తమ సినీ తారల సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. అయితే వీటిలోనూ సూక్ష్మ క్రిములు అధికంగానే ఉంటాయట.
64mi86ude2wk04h921re
ఏటీఎం మిషన్లు… 
అధిక శాతం మంది ప్రజలు వాడే యంత్రాల్లో ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయి. వీటి వద్ద కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
63wcklop5hkyiwpfwbzk
రిమోట్ కంట్రోలర్… 
ఎంత పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువునైనా సులభంగా నియంత్రించే రిమోట్ కంట్రోల్‌పై కూడా క్రిములు పేరుకుని ఉంటాయి. కాబట్టి దీని విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే.
qs9xzajlfhqofhjincgc
బ్రాలు… 
బ్రాలు ధరించే మహిళలు కూడా శుభ్రతను పాటించాల్సిందేనట. ఎందుకంటే వాటిని వేసుకుంటే చెమట అధికంగా పడుతుందట. ఈ క్రమంలో సూక్ష్మ జీవులు శరీరంపై పేరుకుపోతాయి. కాబట్టి వాటిని తీసేసిన వెంటనే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతోపాటు వాటిని కూడా తప్పనిసరిగా వాష్ చేయాలి.
7iwghmaze63vv2hoi04i
టూత్‌బ్రష్‌లు… 
టాయిలెట్ల లోపల లేదా వాటి పక్కనే టూత్‌బ్రష్‌లను స్టాండ్‌లలో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే టాయిలెట్లలో ఉండే క్రిములు టూత్‌బ్రష్‌లపైకి కూడా వ్యాపిస్తాయట. దీంతో ప్రమాదకరమైన అనారోగ్యాలు కలుగుతాయట. కాబట్టి మీ టూత్‌బ్రష్‌లను టాయిలెట్లకు దూరంగా ఉంచండి.
8ax9te98w811w5ju3tfp
ఎస్కలేటర్లు…
ఎస్కలేటర్లపై రెండు వైపులా చేతులతో పట్టుకునేందుకు ఉపయోగపడే రెయిలింగ్‌లపై కూడా బ్యాక్టీరియాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ క్రమంలో వాటిని పట్టుకున్నాక ఏమీ తినకండి! చేతులు శుభ్రంగా కడిగాకే ఏదైనా తినండి.
పెట్రోల్ పంప్స్…
పెట్రోల్ పంపుల్లో ఇంధనం నింపేందుకు వాడే హ్యాండిల్‌పై క్రిములు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిపై కూడా ఓ లుక్కేయండి.

Comments

comments

Share this post

scroll to top