బస్తీ సినిమా రివ్యూ…..! కథ సా…..గతీత! ఫ్లాప్ తో మొదలైంది హీరో వేట!!

సహజనటి జయసుధ కుమారుడు శ్రేయాన్ నటించిన తొలి చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పై ap2tg అనాలసిస్ అండ్ రేటింగ్ ….. ఇవి మా అభిప్రాయాలు మాత్రమే(దయచేసి గమనించగలరు).

                                బస్తీ సినిమా రేటింగ్ (1/5)

basti

 

సినిమా స్టోరి:

హీరో శ్రేయాన్ ,ముఖేష్ రిషి తమ్ముడు. అతడు  విదేశాల నుండి ఇంటికి వస్తాడు, తొలి చూపులోనే హీరోయిన్  ప్రగతిని ప్రేమిస్తాడు .హీరోయిన్ కోటా శ్రీనివాస రావు కూతురు, హీరోయిన్ అన్న అభిమన్యు సింగ్ మెయిన్ విలన్. అయితే కోటా కు,ముకేష్ రిషికి గతంలో జరిగిన వైరుధ్యాల కారణంగా గొడవ అవుతుంది. ఈ గొడవ కారణంతో అభిమన్యు సింగ్  ముఖేష్ రిషి  అనుచరుడి చెల్లి ను చంపేస్తాడు… కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కిడ్నాప్ కు గురవుతుంది. హీరోయిన్ కోసం ఒకవైపు అభిమన్యు సింగ్ , మరోవైపు శ్రేయాన్ ప్రయత్నిస్తుంటారు….. చివరకు శ్రేయాన్ హీరోయిన్ ను ఎలా దక్కించుకున్నాడనేదే సినిమా!!

బలాలు:

  • మొదటి సినిమా అయిన యాక్టింగ్ విషయంలో పర్వాలేదని పించిన శ్రేయాన్.
  • కామెడీ గట్టిగా పండించాడు డైరెక్టర్.
  • ఐటమ్ సాంగ్ లో యాంకర్ రష్మీ అదగొట్టింది.
  • టెక్నికల్ టీమ్ వర్క్

బలహీనతలు:

  • సినిమాలో స్ఫష్టత లోపించింది.
  • అవసరం లేకున్నా మద్యమద్యలో ఫైటింగ్ సీన్లు.
  • సెకెండాఫ్ కథ సాగతీత
  • మ్యూజిక్
  • డైరెక్షన్

ఫైనల్ టచ్: కథ సా…..గతీత! ఫ్లాప్ తో మొదలైంది హీరో వేట!!

మా వర్షన్: ఒక్కమాటలో చెప్పాలంటే లవ్ అండ్ యాక్షన్ మూవీ, తెలుగు సినిమాల పాత ఫార్మాట్ ను కంటిన్యూ చేసినట్టు అనిపించింది. హీరో కొత్తేగానీ….  అదే తెలుగు సినిమాను చూపించాడు దర్శకుడు. సహజనటి జయసుధ కొడుకు ఓపెన్నింగ్ సినిమా మాత్రం మాములుగా కనిపించింది. ఎనీ హౌ శ్రేయాన్ ప్రయత్నం అయితే ఓకే బట్ బలహీనమైన కథతో కలెక్షన్ల వర్షం అసాధ్యం. హీరోగా నిలబడ్డాడా లేదా అనేది ప్రేక్షకులే తేల్చాలి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top