త‌నపై కేసు పెట్టిన భార్యను…. ఈ భ‌ర్త ఎలా కూల్ చేశాడో తెలుసా? Video:

భార్య‌భ‌ర్త‌లు గొడవ‌ప‌డ్డారు…భ‌ర్త మీద కేసు పెట్టింది భార్య‌… భార్య భ‌ర్త‌లిద్ద‌ర్నీ విచార‌ణ‌కు పిలిచారు పోలీసులు.! అస‌లేంటి ప్రాబ్ల‌మ్…? గొడ‌వేంటి? కొత్త‌గా పెళ్ళైన మీ మ‌ద్య గొడ‌వ‌లేంటి? అని ప్ర‌శ్నించ‌డం స్టార్ట్ చేశారు. ఒకానొక ద‌శ‌లో…భ‌ర్త‌ను సీరియ‌స్ గా త‌మ యాంగిల్ న‌చ్చ‌జెప్పాల‌ని ప్ర‌య‌త్నించారు పోలీసులు.! మ్యాట‌ర్ ఎక్క‌డికో పోతుంద‌ని గ్ర‌హించిన భ‌ర్త‌….త‌న భార్య‌కిష్ట‌మైన పాట‌ను అందుకున్నాడు…అంతే భార్య ఐస్ క్రీమ్ లాగా క‌రిగిపోయి, భ‌ర్త భుజాల‌పై వాలిపోయింది.

సినిమా స్టోరీలా ఉన్న ఈ ఘ‌ట‌న‌…ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఝాన్సీలో జ‌రిగింది. ఈ త‌తంగాన్నంతా వీడియో తీశారు పోలీసులు.! ఏ మాట‌కామాట చెప్పుకోవాలి…మ‌నోడు పాటు సూప‌ర్ పాడాడు. ఇంత‌కీ ఏ పాట అనుకున్నారు.బద్లాపూర్‌లోని ‘నా సీఖా జీనా తేరా బినా హమ్ దమ్’.

Watch Video:

 

 

భ‌ర్త పాట‌కు క‌రిగిపోయిన భార్య కూడా..భ‌ర్తకిష్ట‌మైన ఓ పాట‌ను అందుకుంది.! ఈ జంట మీద సినిమా ప్ర‌భావం విప‌రీతంగా ఉందేమో అంటున్నారు నెటీజ‌న్లు.!!

#భార్య పాడిన పాట‌ను కూడా వినండి.

 

Comments

comments

Share this post

scroll to top