1 KG బ‌రువు త‌గ్గితే 2 గ్రాముల బంగారం ఫ్రీ.!!!

Azhar

బ‌రువు త‌గ్గండి-బంగారం గెలుచుకోండి అంటూ ఓ కొత్త స్కీమ్ ను ప్ర‌వేశ‌పెట్టింది దుబాయ్ ప్ర‌భుత్వం.! విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న త‌మ దేశ పిల్ల‌ల భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకుంది. వీడియో గేమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ కు అల‌వాటు ప‌డిన ఆ దేశ‌ పిల్ల‌ల ఒంట్లో విప‌రీతంగా కొవ్వు పేరుకుపోయింద‌ని..బ‌రువు త‌గ్గించ‌కుంటే ప్యూచ‌ర్ లో చాలా ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేయాల్సి వ‌స్తుంద‌న్న కార‌ణంతో దుబాయ్ ప్ర‌భుత్వం…“Your Child in Gold” అనే స్కీమ్ ను ప్రారంభించింది.!

ఈ స్కీమ్ నియ‌మ నిబంధ‌న‌లు:

  • ఈ స్కీమ్ 2-14 సంవ‌త్స‌రాల‌లోపు పిల్ల‌ల‌కు మాత్ర‌మే.
  • కేజీ బ‌రువు త‌గ్గితే…2 గ్రాముల బంగారం ఇస్తారు.!
  • ఒక ఇంట్లో గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మాత్ర‌మే.!

ఎందుకీ స్కీమ్.
BMI ( బాడీ మాస్ ఇండెక్స్ లో…ప్ర‌పంచ దేశ‌ల‌తో పోల్చితే దుబాయ్ లో దాని కంట్రోల్ త‌ప్పింది ముఖ్యంగా పిల్ల‌ల్లో స్థూల‌కాయ‌త్వం పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని బ‌రువు త‌గ్గే విష‌యంలో కాస్తంత అవేర్ నెస్ తీసుకురావాల‌నే ఉద్ధేశ్యంతో దుబాయ్ ప్ర‌భుత్వం ఈ స్కీమ్ ను స్టార్ట్ చేసింది. బంగారం కోసం పేరెంట్స్…పిల్ల‌ల్ని ఉద‌యాన్నే నిద్ర‌లేపి, యోగా, జిమ్, అవుట్ డోర్ గేమ్స్ లాంటి యాక్టివిటీస్ చేయిస్తున్నారు.

డాక్ట‌ర్లేమంటున్నారు.?
బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల హెల్త్ తో పాటు వెల్త్ కూడా వ‌స్తున్న‌ప్ప‌టికీ… బరువు త‌గ్గ‌డం కోసం పిల్ల‌ల్ని డైటింగ్ చేయాల‌ని ఒత్తిడి తెస్తే మాత్రం అది పోష‌కాహార‌లోపానికి దారితీస్తుంద‌ని, దీని కార‌ణంగా పిల్ల‌ల భ‌విష్య‌త్ దెబ్బ‌తింటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Comments

comments