అలా చేస్తే బరువు తగ్గుతారని యూట్యూబ్ వీడియోను ఫాలో అయ్యాడు..! చివరికి ఏమైందో తెలుసా.?

అధిక బరువుతో బాదపడుతున్నారా?..అయితే మీ బరువుని తగ్గించుకోండి…పొట్టిగా ఉన్నామని బాదపడుతున్నారా? ఎత్తు పెరగాలనుకుంటున్నారా?.. సన్నగా ,పీలగా ఉన్నందుకు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆటపట్టిస్తున్నారా? అయితే మా ప్రొడక్ట్ తీసుకోండి సరైన బరువు పెరగండి.. అంటూ రకరకాల ప్రొడక్స్ట్ వాళ్లు ప్రతిరోజు టివిలో ఊదరగొడుతూ ఉంటారు.ఒకదానికి కాదు తెల్లగా కావాలనుకుంటే,పొడుగు కావాలనుకుంటే,అందంగా మారాలనుకుంటే ప్రతి దానికి ఒక ప్రొడక్ట్… ఇలాంటి వాటి గురించే విని ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు తాజాగా మరొకరు..

బరువు తగ్గడానికి రకరకాల ఆఫరేషన్లు వచ్చాయి.అవి వికటించడంతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.వీళ్లల్లో సెలబ్రిటీలు కూడా ఉండడం శోచనీయం.ఒకరికి మంచి చెప్పాల్సిన వారే ఇలాంటి వాటి భారిన పడితే మిగతావారికి ఏం చెప్పగలుగుతారు.టివిల్లో వచ్చే ప్రకటనలు చాలదన్నట్టు చేతిలో స్మార్ట్ ఫోన్ ,అందులో జియో ఫ్రీ నెట్ ఇంక యూట్యూబ్లో ఇలాంటి వీడియోలకు కొదవేలేదు.అలాంటి వీడియో ఒకటి చూసి అధిక బరువుతగ్గాలనుకుని ఆకరుకి ప్రాణాలే కోల్పోయాడు రాంబాబు అనే వ్యక్తి.శ్రీకాకుళం జిల్లా రాజాం పట్నంకు చెందిన సారధి రోడ్డులో నివాసం ఉండే బీన రాంబాబు వయసు 42ఏళ్లు.యూట్యూబ్ లో  బరువు తగ్గించే వైద్య ప్రకటన చూసి వారంరోజుల నుంచి 75 మిల్లీలీటర్ల చొప్పున రోజూ మూడు పూటలా కొబ్బరి నూనె తాగేవాడు. అది వికటించడంతో  తన ప్రాణాలను కోల్పోయాడు.

కేవలం ఈ ప్రకటనలే కాదు రకరకాల డైట్ల పేరుతో కూడా మార్కెట్లో చలామణి అవుతున్నాయి.బరువు తగ్గడానికి ఏ పద్దతి ఫాలో అయిన డాక్టర్ పర్యవేక్షనలో చేస్తే బాగుంటుంది.మన సొంత ప్రయోగాలతో ముందుకెళితే మూల్యం చెల్లించుకోకతప్పదు.అయినా తెలియక అడుగుతాను,బరువుతగ్గి,ఎత్తు పెరిగి అందంగా మార్చగలిగేంత శక్తి ఈ మందులకు వీటికి ఉంటే ప్రపంచంలో ఇన్ని రకాల మనుషులెందుకు అందరూ అందంగా తయారవుతారు కదా..ఆత్మవిశ్వాసాన్ని మించిన అందం ఏముంటుంది..

Comments

comments

Share this post

scroll to top