స‌ముద్ర‌పు నీటిని తాగునీటిగా మార్చే నూత‌న విధానాన్ని క‌నుగొన్న భార‌త సైంటిస్టులు… 

మనదేశంలో తాగునీటికి ఏవిధమైన కొరత ఉందో అందరికీ తెలిసిందే. తాగునీరే కాదు అసలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు కరువైన దుస్థితి నెలకొంది. ప్రధానంగా వేసవి వచ్చిందంటే చాలు, ఇక నీటి కోసం నానా అవస్థలు పడాల్సిందే. అయితే ఇకపై ఆ బాధలు తీరనున్నాయి. ఎందుకంటే పలువురు సైంటిస్టులు సముద్రపు నీటిని తాగే విధంగా మార్చే ఓ నూతన ప్రక్రియను తాజాగా కనుగొన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై సముద్రపు నీటిని కూడా తాగొచ్చు!

barc-center

తమిళనాడులోని కల్పకంలో ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిస్టులు న్యూక్లియర్ రియాక్టర్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను ఉపయోగించి సముద్రపు నీటిని ఫిల్టర్ చేసే నూతన ప్రక్రియను కనుగొన్నారు. దీని వల్ల సముద్రపు నీటిలో సాధారణంగా ఉండే విష పదార్థాలే కాదు, ఆర్సెనిక్, యురేనియం వంటి రసాయనాలు కూడా తొలగింపబడుతాయి. దీంతో ఆ నీరు స్వచ్ఛమైన మినరల్ వాటర్‌గా మారుతుంది. ఆ నీటిని ఎంచక్కా మనం తాగవచ్చు.

sea-water-mineral-water

సైంటిస్టులు కనుగొన్న ఈ విధానం వల్ల నిత్యం 63 లక్షల లీటర్ల నీటిని ఫిల్టర్ చేయవచ్చట. దీంతో దేశంలో నీటి కోసం అవస్థ పడుతున్న జనాల కష్టాలు తొలగిపోనున్నాయి. సముద్రపు నీటిని ఫిల్టర్ చేసేందుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుందట. దీని వల్ల ఆ నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లను, మెషీన్లను ప్రజలకు తక్కువ ధరలకే అందించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం సముద్రపు నీటిని పెద్ద ఎత్తున శుద్ధి చేసే ప్లాంట్ కల్పకంలోని బార్క్ సెంటర్‌లోనే ఉంది. ఈ తరహా ప్లాంట్లను త్వరలోనే పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లోనూ నెలకొల్పనున్నారు. అంతేకాకుండా ముందు చెప్పిన విధంగా సముద్రపు నీటిని శుద్ధి చేసే తక్కువ ఖరీదు కలిగిన ఫిల్టర్లను ప్రజలకు త్వరలో అందించనున్నారు. ఈ క్రమంలో బార్క్ సైంటిస్టులు ఆ ఫిల్టర్లను తయారు చేసే పనిలో పడ్డారు. అయితే వీటిని ముందుగా తీవ్రమైన కరువు ఉన్న మహారాష్ట్రలోని మరఠ్వాడా వంటి ప్రాంతాలకు సరఫరా చేయనున్నారట. ఏదేమైనా, మన దేశ సైంటిస్టులు ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు చేసినందుకు మనం ఎంతో గర్వపడాల్సిందే! వారికి అభినందనలు తెలపాల్సిందే! ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top