స‌మ్మె బాట‌లో బ్యాంక‌ర్లు – రోడ్డు పాలైన జ‌నాలు

దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌లో ప‌నిచేస్తున్న 10 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. తాము ప్ర‌జ‌ల‌కు విశిష్ట సేవ‌లు అంద‌జేస్తున్నామ‌ని .ఉద‌యం ప‌ది గంట‌ల‌కు వ‌చ్చి రాత్రి వ‌ర‌కు ప‌నిచేస్తున్నామ‌ని వారంటున్నారు. వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేయ‌కుండా ప‌ని చేయ‌మంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. లావాదేవీలు కాకుండా ఆయా ప్ర‌భుత్వాలు త‌మ‌తో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయ‌ని ఆరోపిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకు, ఐఓబీ, త‌దిత‌ర ప్ర‌భుత్వ బ్యాంకులలో లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయి. దేశ వ్యాప్తంగా అన్నీ మూత ప‌డ‌డంతో వ్యాపారులు, ఖాతాదారులు, పెన్ష‌న్ దారులు, ప్ర‌జ‌లంతా రోడ్డు పైకి వ‌చ్చారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది ఏటీఎంల‌లో డ‌బ్బులు దొర‌క‌క తిప్ప‌లు ప‌డుతున్నారు. దేశ‌మంత‌టా ఇదే ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. ఇప్ప‌టికే నోట్ల‌ను భ‌ద్రంగా ఏటీఎంల‌లోకి చేర్చామ‌ని ఎలాంటి సమ‌స్య ఉండ‌ద‌ని చెబుతున్నారు బ్యాంక‌ర్లు.

ఆల్ ఇండియా బ్యాంక‌ర్స్ ఫెడ‌రేష‌న్ , త‌దిర బ్యాంక‌ర్స్ అసోసియేష‌న్ల‌న్నీ క‌లిసి మూకుమ్మ‌డి ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. ఏ ఒక్క బ్యాంకు తెరుచు కోలేదు. కోట్లాది మంది ఖాతాదారుల లావాదేవీలు నిలిచి పోయాయి. ఒక రోజు కార్య‌క‌లాపాలు నిలిపి వేస్తే దాని ప్ర‌భావం ఉద్యోగుల‌పై ఉండ‌క పోవ‌చ్చు.కానీ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌పై, వ్యాపారుల‌పై.ప‌రోక్షంగా మార్కెట్, స్టాక్ మార్కెట్, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల రోజూ వారీ వ్య‌వ‌హారాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. ఏ ముహూర్తాన నోట్ల ర‌ద్దు కార్య‌క్ర‌మాన్ని దేశ ప్ర‌ధాని మోడీ చేప‌ట్టారో.ఆ రోజు నుండి రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప‌నితీరుపైనే అనుమానాలు రేకెత్తేలా చేశారు. ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించి 72 ఏళ్ల‌వుతున్నా ఏనాడూ ఆర్బీఐపై ఏ ఒక్క‌రు ప‌ల్లెత్తు మాట అనేందుకు ఇష్ట‌ప‌డే వారు కాదు. అంతటి నిబ‌ద్ధ‌త‌తో త‌న ప‌నితీరుతో సేవ‌లు అందిస్తూ.భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచి ఉన్న‌ది. మోడీ పుణ్య‌మా అంటూ అర్ధ‌రాత్రి చేసిన ప్ర‌క‌ట‌నతో బ్యాంకుల‌ను కంట్రోల్ చేయ‌లేక‌, ఏటీఎంల‌లో డ‌బ్బులు ఉంచ‌లేక చేతులెత్తేసింది.

ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. త‌మ డ‌బ్బులు ఉంటాయో .ఊడిపోతాయో తెలియ‌ని ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చింది.బీజేపీ స‌ర్కార్. 2016లో తీసుకున్న ఆ నిర్ణ‌యం .దేశానికి ఓ బ్లాక్ డేగా అభివ‌ర్ణించ‌వ‌చ్చంటారు.ఓ ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌. కేంద్ర ప్ర‌భుత్వంలో కొలువు తీరిన మోడీ .తాను చెప్పిందే శాస‌నం.చ‌ట్టం.వేదం అన్న రీతిన తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యంగా విప‌క్షాలు కొట్టి పారేశాయి. దేశ స‌మ‌గ్ర‌త‌కు, ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప కూలిపోయేందుకు దోహ‌ద ప‌డ్డ‌దే త‌ప్పా .ప్ర‌జ‌ల‌కు ఒరగ‌బెట్టింది ఏమీ లేదు. నోట్ల ర‌ద్దు ఒక వైపు.మ‌రో వైపు దేశ‌మంత‌టా ఒకే ప‌న్నుల విధానం పేరుతో జీఎస్టీ తెచ్చారు. అది కూడా ఈరోజు వ‌ర‌కు గాడిన ప‌డ‌లేదు. కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు త‌క్కువ‌గా వుంటే.మ‌రికొన్ని ఎక్కువ‌గా ఉన్న వాటిపై భారీ ఎత్తున ప‌న్ను విధించ‌డం .విత్త మంత్రి దానిని గొప్ప‌గా చెప్పుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. జీఎస్టీ పుణ్య‌మా అంటూ వేలాది మంది అక్కౌంట్స్ , సీఎలు, ఆడిట‌ర్లు కోట్లు వెన‌కేసుకున్నారు. ఐటీ శాఖ గురించి ఎంత త‌క్కువ చెపితే అంత మంచిది.

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో బ్యాంక‌ర్లు విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రికొంద‌రు దాడుల‌కు లోన‌య్యారు. అయినా సిబ్బంది అహోరాత్రులు శ్ర‌మించి బ్యాంకులు కుప్ప కూలిపోకుండా కాపాడుకోగ‌లిగారు. లేక‌పోతే వాళ్లు.వారి మీద ఆధార‌ప‌డిన కుటుంబాలు ప్ర‌జ‌ల‌తో పాటు రోడ్ల‌పాల‌య్యేవి. ఆర్బీఐ రోజూ ఏదో ఒక కొత్త నిబంధ‌న విధించ‌డం దాని పేరుతో ప్ర‌భుత్వ బ్యాంకులు సేవ‌ల పేరుతో ఫీజులు, రుసుముల పేరుతో బాదుడు స్టార్ట్ చేశాయి. దీంతో ప్ర‌భుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులే ముద్దు అంటూ క‌ష్ట‌మ‌ర్లు అటు వైపు మ‌ళ్లుతున్నారు. డిజిట‌ల్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌ని లేకుండా ప‌నులన్నీ ఎంచ‌క్కా చ‌క‌చ‌కా పూర్త‌వుతుండ‌డంతో ఖాతాదారులు వీళ్లు స‌మ్మె బాట పట్టినా ప‌ట్టించు కోవ‌డం మానేశారు. పెన్ష‌న్లు, రైతు బంధు ప‌థ‌కం ద్వారా రుణాల మాఫీ, కొత్త రుణాలు అందించ‌డం అన్నీ తామే చేస్తున్నామ‌ని.ఈ ప‌ని భారాన్ని త‌ట్టుకోలేక పోతున్నామ‌ని బ్యాంక‌ర్లు రోడ్డెక్కారు. ఇలా ఆందోళ‌న‌ల‌కు దిగ‌డం దేశ వ్యాప్తంగా ఇది రెండో సారి. అయినా మోడీ చ‌లించ‌డం లేదు. అరుణ్ జైట్లీ స్పందించ‌డం లేదు. రాహుల్ గాంధీ తాను ఎప్పుడూ మీ వెంటే ఉంటాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

తాము ఎక్కువ వేత‌నాలు ఇవ్వ‌మ‌ని కోర‌డం లేద‌ని.2017లో అమ‌లు చేయాల్సిన వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌కారం జీతాలు చెల్లిస్తే చాలంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. క్వాలిఫికేష‌న్స్, అనుభ‌వం ఉన్న వారంద‌రికీ ఒకే వేత‌నం అమ‌లు చేస్తే ఎలాగ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త కుండా ఉండేందుకు ముంద‌స్తు నోటీసులు అంద‌జేశామ‌ని తెలిపారు. బ్యాంకుల లాభాలు పడిపోయాయని, నష్టాలు వస్తున్నాయని అని కారణాలు చెబుతున్నారు. వాస్తవానికి బ్యాంకుల లాభాలు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. మొండి బకాయిల వల్లనే లాభాలు హరించుకు పోతున్నాయి. 2016-17, 2017-18 సంవత్సరాల్లో లాభాలన్నీ మొండి బకాయిలకు ప్రకటించిన మాఫీ (రైట్ ఆఫ్) కిందకే పోయాయి. దాంతో లాభాలు లేవు. కానీ దీనికి బాధ్యులెవరు? ఉద్యోగులు కారు కదా? అది యాజమాన్యాల బాధ్యత. దీన్ని సాకుగా చెబితే ఎలా ఒప్పుకుంటాం.అని ప్ర‌శ్నిస్తున్నారు.

వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని .త‌మ విష‌యంలో కేంత్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంటేనే స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని అంటున్నారు. దేశ వ్యాప్త స‌మ్మెతోనైనా మోడీ , జైట్లీ అండ్ టీం క‌ళ్లు తెరిస్తే మంచిది లేక‌పోతే అటు రైతులు, ఇటు నిరుద్యోగులు, బ్యాంక‌ర్ల నుండి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకునే ప్ర‌మాదం పొంచి ఉంది.

Comments

comments

Share this post

scroll to top