బ్యాంకు లో హల్చల్ చేసిన స్పైడర్ మ్యాన్, వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియోస్.!!

స్పైడర్ మ్యాన్ బ్యాంకు కి వస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.? స్పైడర్ మ్యాన్ ని దెగ్గర నుండి ఫోటోలు తీస్తుంటే ఎట్టా ఉంటాదో తెలుసా.? అసలు స్పైడర్ మ్యాన్ బ్యాంకు కి రావడం ఏంటని అనుకుంటున్నారా.? వివరాల్లోకెళితే, బ్యాంకు లో అతనికి చివరి రోజు, పదవి విరమణ రోజుని అందరికి గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చెయ్యాలని అందరూ అనుకుంటారు, అలాగే అతను అనుకున్నాడు, అనుకున్నదే ఆలస్యం అన్నట్టు కొత్త గెట్ అప్ లో దర్శనమిచ్చాడు బ్యాంక్ లో.

స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్.. ఫ్రెండ్లీ ఆఫీస్ గాయ్ స్పైడర్ మ్యాన్.. :

స్పైడర్ మ్యాన్ గెట్ అప్ లో ఆఫీస్ కి వెళ్ళాడు ఆ వ్యక్తి, మొదట్లో అందరూ కంగారు పడ్డారు ఎవరా అని, కానీ ఆ వ్యక్తి తన సిస్టం ముందర కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్లకు అర్ధమైంది ఆ వ్యక్తి ఎవరో, దీంతో వాళ్ళు కంగారు పడటం మానేసి సంతోష పడ్డారు, ఆ రోజంతా తను అలాగే వర్క్ చేసాడు, కస్టమర్స్ కూడా మొదట్లో కంగారు పడినా, తరువాత కుదుట పడ్డారు

జీవితాంతం గుర్తుండిపోయేలా..!!

తనకే కాదు, తనతో పని చేసిన వ్యక్తులందరికీ జీవితాంతం ఆ రోజు కచ్చితంగా గుర్తుండిపోతాది, ఆ రోజు ఆఫీస్ సమయం పూర్తయ్యాక స్పైడర్ మ్యాన్ వేష ధారణ లోనే కొందరు కస్టమర్స్ కి, తనతో పనిచేస్తున్న వారికి ఫోటోలు ఇచ్చాడు, ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేసారు, వీడియో కి విశేషమైన ఆదరణ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా, వీడియో వైరల్ అయిపోయింది.

రానున్న రోజుల్లో…!!

జీవితం లో ఉద్యోగం అనేది ఒక భాగం, రిటైర్మెంట్ తరువాత కష్ట పడిన కాలాన్ని గుర్తుతెచ్చుకొని సంతోషంగా గడుపుతారు, రిటైర్మెంట్ డే ని మాత్రం ఎవ్వరు మర్చిపోలేరు, వారి జీవితం లో వారు చివరి రోజు పని చేసిన రోజు వారికి ఎప్పటికి గుర్తుండిపోతుంది. రానున్న రోజుల్లో ఈ వ్యక్తి లాగే మరి కొంత మంది కొత్త తరహా లో అలోచించి వారి రిటైర్మెంట్ డే ని స్పెషల్ గా మార్చుకుంటారు.

 

Comments

comments

Share this post

scroll to top