క్రికెట్ బ‌ట్ట‌లిప్పిన బంగ్లాదేశ్ కెప్టెన్.! క్రికెట్ కు దేశ‌భ‌క్తికి సంబంధమేంట‌ని త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్.!!

సాధార‌ణంగా క్రికెట్ ఓ ఆట‌….కానీ మ‌న‌లో చాలామందికి అది ఆ స్థాయిని దాటింది.! ఎంత‌గా అంటే దేశ‌భ‌క్తికి క్రికెట్ కు లింక్ పెట్టి….పేట్రేగిపోయేటంత‌లా….!! గెలిస్తే క్రికెట‌ర్ల ఫోటోల‌కు పూల‌దండ‌లు,పాలాభిషేకాలు…. ఓడితే ఆవే ఫోటోల‌కు చెప్పుదెబ్బ‌లు, సున్నంబొట్లు….. స్పూర్తిని నింపాల్సిన గేమ్….జ‌నాన్ని సూసైడ్ చేసుకునే వ‌ర‌కు తీసుకెళ్లింది. దీనంత‌టిని గ‌మ‌నించిన బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మొర్త‌జా…త‌న దైన స్టైల్లో….క్రికెట్ అభిమానులం అంటూ హద్దులు దాటుతున్న వారి క‌ళ్ళు తెరిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌ని మాట‌లు య‌దాత‌థంగా మీకోసం…..

 

క్రికెటర్లుగా మేము దేశానికేం చేయ‌ట్లేదు…కేవ‌లం డబ్బులు తీసుకునే క్రికెట్ ఆడుతున్నాం…క్రికెట్ కు దేశభక్తికి ముడిపెట్టడం సరికాదు. క్రికెట్ అభిమానులారా…మ‌మ్మ‌ల్ని హీరోలుగా ఆరాధించ‌కండి…అస‌లు అలా చూడ‌కండి.!! నేను ఒక క్రికెటర్ ను మాత్రమే… ఒకరి ప్రాణాన్ని కాపాడలేను . అదే ఓ డాక్టర్ కాపాడగలడు.. కానీ దేశంలోని అత్యుత్తమ డాక్టర్ ను ఎవరూ అభినందించరు? . వాళ్లే నిజమైన స్టార్లు !! అలాగే శ్రామికులు కూడా… వాళ్లు దేశాన్ని నిర్మిస్తారు…. మేం క్రికెట్‌ ద్వారా ఏం చేయ‌గ‌లం….? కనీసం ఒక ఇటుకను తయారు చేయలేం….. క్రికెట్‌ మైదానంలో వరిని కూడా పండిచలేం.! ఇటుకలతో ఫ్యాక్టరీలు నిర్మించే శ్రామికులు.. పొలాల్లో పంటలు పడించేవాళ్లు నిజమైన హీరోలు.! వాళ్ళ‌ను అభిమానించండి, వాళ్ళ‌ను ఆరాధించండి.!!

క్రికెటర్లుగా మేమేం చేస్తాం? నిజాయితీగా చెప్పాలంటే డబ్బులు తీసుకుంటాం… ఆట ఆడతాం. ! అంతే….!! ఒక సింగర్, యాక్టర్ చేసేదే మేమూ చేస్తాం . అంతకుమించి ఏం పొడ‌వ‌లేం.!! క్రికెట్‌తో ముడిపడ్డ దేశభక్తి ఏంటో నాక‌ర్థం కాట్లేదు.!! రోడ్డు మీద అరటి తొక్కలు వేయడం, వీధుల్లో ఉమ్మడం, ట్రాఫిక్‌ రూల్స్ తిక్రమించడం మానండి అదే దేశ‌భ‌క్తి అవుతుంది.మీ దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం కోసం గెలిస్తే మా ఫోటోల‌కు దండ‌లు వేయ‌డం…ఓడితే మా ఇంటి మీద‌కు రాళ్ళు వేయ‌డం మానండి!అది దేశ‌భక్తి కాదు కాజాగ‌ల‌దు.!!!

 

Comments

comments

Share this post

scroll to top