ఆ బామ్మ విమానం ఎక్కుతూ…ఇంజిన్ లోకి 9 నాణేలు విసిరింది..! తర్వాత ఏమైందో తెలుసా…?

బయటికి వెళ్లేప్పుడు తుమ్మితే కాసేపు కూర్చుని వెళ్లడం… ఒకసారి బయటికి వెళ్లాక మళ్లీ వెనక్కి వస్తే పని జరగదు అని అనుకోవడం…పిల్లి ఎదురొస్తే బయటికెళ్లకపోవడం  లాంటి నమ్మకాలను ఇప్పటికీ నమ్మేవాళ్లున్నారు..కొందరు వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తారు… ఏ నమ్మకాలైనా ఇతరులను ఇబ్బంది పెట్టనంతవరకే…అదే నమ్మకం మితిమీరి ఇతరుల  ప్రాణాలకు ముప్పు తెస్తే …సరిగ్గా ఇలాంటి పనే చేసింది ఒక ముసలావిడ…

చైనాలోని షాంగై పోడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోకి 80 ఏళ్ల ఓ బౌద్ధమతస్థురాలు వచ్చింది. గ్వాంజ్వోహ్యూకు వెళ్లేందుకు టికెట్ తీసుకుని విమానాన్ని ఎక్కేందుకు రన్‌వేపైకి వెళ్లింది.వెళ్లినావిడ వెళ్లి ఫ్లైట్ ఎక్కకుండా  అక్కడ ఒక ఓ వింత పని చేసింది. తన దగ్గరున్న తొమ్మిది నాణేలను తీసి తన ప్రయాణం చేసే విమానం ఇంజిన్‌లోకి విసిరేసింది. ఆమె చేసిన ఈ పనినంతా సీసీ కెమెరాలో  చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానం పైలెట్‌కు విషయం చెప్పాడు. ఆమెను పట్టుకుని అసలు విషయం అడిగితే ‘నేను బౌద్ధమతస్థురాలిని.. నాణేలను వాహనంపై విసిరిస్తే నాకు మేలు జరుగుతుంది. అందుకే ఇంజన్‌లో తొమ్మిది నాణేలను విసిరేశా’ అని చావు కబురు చల్లగా చెప్పింది.

విమానసిబ్బంది స్పెషల్ ఆపరేషన్‌తో ఆ తొమ్మిది నాణేలను వెలికి తీశారు.ఆమె చేసిన ఘనకార్యం వల్ల  ఏకంగా 6 గంటల పాటు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.. సిబ్బంది గమనించకుండా ఉండుంటే ఎంత ప్రమాదం జరిగేదో… తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ,విమానయాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారా.. ఇంత చేసిన ఆమెకు కోర్టు అయిదు రోజుల జైలు శిక్ష విధించినా.. 70 ఏళ్ల వయసు పైబడి ఉండటంతో.. ఆ శిక్షను కూడా ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది.

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top