ఒకప్పుడు చిన్నారి పెళ్లికూతురు… ఇప్పుడు కాబోయే డాక్టర్..!!

బాల్యవివాహాలు రూపుమాపుతాం అని ప్రభుత్వం,సంఘసంస్కర్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అక్కడక్కడ మనకు చిన్నారి పెళ్లి కూతుర్లు కనపడ్తూనే ఉన్నారు… వివాహం జరిగాక నాలుగ్గోడల మధ్య..కుటుంబ అవసరాలు తీర్చే యంత్రాలుగా మగ్గిపోతున్నారు..అలాంటి పరిస్థితులన్నింటిని దాటుకుని డాక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు… దానికి అత్తమామలు,భర్త సహకరించడం ప్రశంసించదగ్గ విషయం….

రూప అయిదుగురు తోబుట్టువలతో కలిసి ఆడుతు పాడుతూ 3వ తరగతి చదువుతున్నప్పుడు… పన్నెండేళ్ల శంకర్ లాల్  కి  ఇచ్చి వివాహం చేశారు రూప తల్లిదండ్రులు… అక్కడితో తన జీవితం అయిపోయిందని బాదపడ్లేదు రూప…. చదువుకోవడానికి అత్తమామాల్ని ఒప్పించింది..భర్తతో పాటు తను స్కూల్ కి వెళ్లింది… తనపై నమ్మకం పెట్టుకుని చదివించిన అత్తమామాల భర్త ఆశల్ని నిజం చేస్తూ పదవ తరగతిలో 84 శాతం మార్కులు తెచ్చుకుంది..రూప మామ భీమరాం యాదవ్ సరైన వైద్యం అందకపోవడం వల్ల గుండెపోటుతో మరణించాడు. దీంతో అప్పుడే రూపలో డాక్టర్ కావాలన్న ఆశ రూపలో బలంగా నాటుకుంది…తర్వాత ఇంటర్మీడియట్లో బైపిసి తీస్కుని అందులోకూడా 84శాతం మార్కులు సాధించింది…

 

కోటా- ఆధారిత సంస్థ ద్వారా విద్యను కొనసాగించిన రూప మూడో ప్రయత్నంలో పరీక్షను పూర్తి చేసుకుంది. నీట్‌లో 603 మార్కులు సాధించిన ఈమె వైద్య విద్యలో ప్రవేశం కోసం సిద్ధమవుతోంది. ఎఐపిఎంటి నిర్వహించిన పరీక్షలో 415 మార్కులు సాధించి 23వేల ర్యాంకు పొందింది. చివరి ప్రయత్నంలో భాగంగా ఒక సంవత్సరం కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షలో 603 మార్కులు సాధించింది. .అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీలో సీటు రావాలని భావిస్తోంది. ఆర్థికంగా కుటుంబం వెనకబడి ఉండటం మూలంగా రూప నాలుగు సంవత్సరాల ఎంబిబిఎస్ విద్య కోసం నెలవారీ స్కాలర్ షిప్‌ను అందించేందుకు అల్లెన్ కోచింగ్ సంస్థ ముందుకు వచ్చింది…

 చదువుకునే రోజులు పోయి చదువు”కొనే” రోజుల్లో కష్టపడి ఈ స్థానానికి చేరుకున్న రూప తన వైధ్యవిద్య ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం… ఆర్ధిక స్థోమత లేక ఎందరో విధ్యార్ధులు చదువుకు దూరమైన పరిస్థితులు మనం ఎన్నో చూశాం…రూప విషయంలో అలా జరగకూడదని తను పెద్ద డాక్టర్ కావాలని ఆశిద్దాం… ఆల్ ది బెస్ట్ రూపా…
.

Comments

comments

Share this post

scroll to top