ప్రసాదమే ఆ బాలుడి ప్రాణాలు కాపాడింది.! ఎలాగో తెలుసా.? అసలేమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

నేటి త‌రుణంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న విష‌యాల‌కే తీవ్ర మ‌న‌స్థాపానికి లోనై ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నిండు నూరేళ్ల జీవితానికి మ‌ధ్య‌లోనే ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. క‌న్న‌వారికి, కుటుంబ స‌భ్యుల‌కు తీర‌ని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకుని సాధించేది ఏం లేద‌ని తెలిసినా కొంద‌రు ఆ ప్ర‌య‌త్నాన్ని మాత్రం మాన‌డం లేదు. తాజాగా ఓ కుటుంబం కూడా ఇలాగే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అయితే ఆ కుటుంబంలోని ఓ బాలుడు మాత్రం అదృష్ట‌వ‌శాత్తూ త‌ల్లిదండ్రులు చేసిన ఆత్మ‌హ‌త్య య‌త్నం బారిన ప‌డ‌లేదు. దీంతో ఇప్పుడ‌త‌ను త‌న బామ్మ‌, తాత‌ల సంర‌క్ష‌ణ‌లో ఉన్నాడు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

అది ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతం. అక్క‌డ కిషోర్ లాల్ (74) అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. అత‌నికి రాకేష్‌, విక్కి, రాజేష్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇక వీరు దక్షిణ ఢిల్లీలోని గోవిందపూరీలోని తమ 6 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఒక్కో ఫ్లోర్‌లో ఒక్క‌రు నివసిస్తున్నారు. కాగా కిషోర్‌ లాల్‌ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే చిన్న కొడుకు విక్కికి, తండ్రి కిషోర్ లాల్‌కు గ‌త కొంత కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవి. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న మొద‌టి, రెండో అంత‌స్తుల‌ను విక్కీ త‌న పేరు మీద‌కు మార్పించాల‌ని తండ్రి కిషోర్ లాల్‌తో గొడ‌వ ప‌డుతుండేవాడు. కానీ లాల్ మాత్రం అందుకు అంగీక‌రించే వాడు కాదు. దీంతో అన్న రాకేష్‌తో క‌లిసి విక్కీ తండ్రి లాల్‌ను ఓ సారి కొట్టారు. దీంతో లాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయిన‌ప్ప‌టికీ విక్కీ త‌న పంథా మార్చుకోలేదు. ఎలాగైనా స‌ద‌రు ఆస్తిని త‌న పేరిట మార్చాల‌ని తండ్రితో త‌ర‌చూ అనే వాడు. అలా చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించేవాడు. అయినా విక్కి మాట‌ల‌ను లాల్ లెక్క చేయ‌లేదు.

ఎన్నిసార్లు అడిగినా తండ్రి లాల్ వినిపించుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు విక్కి త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే తాజాగా విక్కీ ఓ రోజు ఉద‌యం చివ‌రిసారిగా తండ్రిని ఆస్తిని త‌న పేరిట బ‌ద‌లాయించ‌మ‌ని మ‌రో సారి అడగ్గా అప్పుడు కూడా లాల్ నిరాక‌రించాడు. దీంతో విక్కీ త‌న భార్య ల‌లిత‌, కూతురు రాంచీ (6), కుమారుడు రిష‌బ్ (3)ల‌తో క‌లిసి తన ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుందామని నిర్ణ‌యించుకున్నాడు.

విక్కీ నిర్ణ‌యానికి అంగీక‌రించిన అత‌ని భార్య ల‌లిత ప‌క్క ఇంట్లో ఆడుకుంటున్న కూతురు రాంచీ, కుమారుడు రిష‌బ్‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు వెళ్లింది. అయితే రిష‌బ్ మాత్రం ప్ర‌సాదం కోసం ఆగాడు. దీంతో కూతురు రాంచీని ఇంట్లోకి తీసుకెళ్లిన ల‌లిత భ‌ర్త ఆదేశాల మేర‌కు అత‌నితో క‌ల‌సి విషం మింగింది. అనంత‌రం కూతురికి విషం ఇచ్చింది. చివ‌ర‌కు విక్కీ కూడా విషం మింగాడు. దీంతో ముగ్గురూ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. కాగా ప్ర‌సాదం కోసం ఆగిన రిష‌బ్ ఒక్క‌డే బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. ఇప్పుడు అత‌ను త‌న తాత, బామ్మ‌ల సంర‌క్ష‌ణ‌లో ఉన్నాడు. పెద‌నాన్న రాకేష్ రిష‌బ్‌ను పెంచుకునేందుకు అంగీక‌రించాడు. అలా ఓ కుటుంబం అన‌వ‌స‌రంగా చిన్న విష‌యానికే ప్రాణాలు తీసుకుంది. ఏది ఏమైనా ఇలాంటి దుస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top