బల్లిశాస్త్రం ప్రకారం..బల్లి మన ఏయే శరీర భాగాల మీద పడితే ఏమవుతుంది?

బల్లి ఒక సరీకృపజీవి. ఇవి ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాంతి దగ్గర ఉన్న చిన్న చిన్న పురుగులను తిని బ్రతుకుతూ ఉంటాయి. బల్లి విషపురుగుగా చెబుతుంటారు. బల్లి కరవకపోయినా, బల్లి పడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే అపోహ కూడా ఉంది. అయితే అప్పుడప్పుడు  బల్లి  మనమీద పడ్డప్పుడు గానీ మీదిపాకుతూ వెళ్లినప్పుడు, లేదా మనను తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని, భవిష్యత్ లో ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. బల్లి మీద పడినప్పుడు దుష్పలితాలు ఎదురవుతాయని అంటారు. బల్లిశాస్త్రం ప్రకారం బల్లి మీద పడితే జరిగే దుష్పలితాలను తమిళ్ లో ‘పల్లి విజ్హుం పాలన్’ అని అంటారు. బల్లిశాస్త్రము ప్రకారం బల్లి మనుషుల శరీరంపై  పడితే ఎటువంటి శుభం, అశుభం కలుగుతుందో చెప్పడం జరిగింది.

watch video here:

Indian_house_gecko
మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:
 • తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు
 • ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
 • ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది
 • కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది
 • నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం
 • కుడి చెంప- బాధపడటం
 • ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము
 • పై పెదవి -కలహాలు వెంటపడుతాయి
 • కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది
 • రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని
 • వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది
 • వీపుపై కుడి వైపు- రాజ భయం
 • మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది
 • మోచేయి – డబ్బు నష్టం
 • వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక
 • కుడి భుజం -కష్టాలు, సమస్యలు
 • ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది
 • తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
 • మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి
 • కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు
 • పాదములపై -ప్రయాణానికి సిద్ధం
img_0058-e1395835950136
బల్లి స్త్రీల శరీరంపై పడితే:
 • తలపై -మరణ భయం
 • కొప్పుపై-రోగాల భయం
 • పిక్కలపై-బంధువుల రాక
 • ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు
 • కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్
 • రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది
 • కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని
 • కుడి చెవి-ధన లాభం, ఆదాయం
 • పై పెదవి-విరొధములు కలుగుతాయి
 • కింది పెదవి -కొత్త  వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి
 • రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
 • వీపుపై-మరణ వార్త వింటారు
 • గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు
 • చేతులపై-ధన లాభం
 • ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి
 • వేళ్ళపై- నగల ప్రాప్తి
 • కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది
 • భుజం-నగల ప్రాప్తి
 • తొడలు-కామము
 • మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము
 • చీలమండము -కష్టాలు
 • కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది
 • కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.
608668388

Comments

comments

Share this post

scroll to top