14 ఏళ్ల బాలికతో అసభ్యంగా చాటింగ్ చేసాడు…తీరా విష‌యం తెలిశాక ఆ వ్య‌క్తి షాక్‌..! చివరికి ఏమైంది?

ఓ వైపు చ‌క్కని ఉద్యోగం. ల‌క్ష‌ల్లో జీతం. భార్య, పిల్ల‌లు ఉన్నారు. విలాస‌వంతమైన లైఫ్ గ‌డ‌ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఆ వ్య‌క్తికి తృప్తి లేదు. కోరి త‌నంత తానుగా వ‌చ్చి ఉచ్చులో ప‌డ్డాడు. ఇప్పుడు జైలు ఊచ‌లు లెక్క‌పెడుతున్నాడు. తాను ఓ 14 ఏళ్ల బాలిక‌తో చాటింగ్ చేస్తున్నాన‌ని అనుకున్నాడు కానీ, అవ‌త‌ల ఉంది సైబ‌ర్ పోలీసు టీం అని అత‌నికి తెలియ‌దు. దీంతో అవ‌త‌ల ఉంది నిజంగానే బాలిక అనుకుని ఆమెకు అస‌భ్య‌క‌ర పోస్టులు పంపాడు. కానీ చివ‌ర‌కు అదే పోలీసు టీంకు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. యూకేలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.

యూకేలో భార‌త్‌కు చెందిన బాల‌చంద్ర‌న్ క‌వుంగ‌ల్‌ప‌రంబ‌త్ అనే 38 ఏళ్ల వ్య‌క్తి ఎంతో కాలంగా అక్క‌డి సిటీ బ్యాంక్‌లో ప‌నిచేస్తున్నాడు. అత‌నికి భార్య‌, పిల్ల‌లు కూడా ఉన్నారు. అత‌ను యూకేలో ఉండేది ఈస్ట్ లండ‌న్‌లో. అయితే ఈ మ‌ధ్యే అత‌నికి ఓ 14 ఏళ్ల బాలిక‌తో ఆన్‌లైన్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దీంతో ఆమెకు బాల‌చంద్ర‌న్ అస‌భ్య‌ర పోస్టుల‌ను పంపేవాడు. అయితే నిజానికి అవ‌త‌ల ఉంది బాలిక కాదు, యూకేకు చెందిన సైబర్ పోలీస్ టీం. వారిని ఇంట‌ర్నెట్ ఇంట‌ర్‌సెప్ట‌ర్స్ అని పిలుస్తారు. వీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడూ నిఘా పెడ‌తారు. పిల్ల‌ల‌ను లైంగికంగా వేధించే వారిని వ‌ల వేసి ప‌ట్టుకుంటారు. అదీ వీరి ప‌ని.

అయితే స‌ద‌రు సైబ‌ర్ పోలీసులు ఓ 14 ఏళ్ల బాలిక పేరిట బాల‌చంద్ర‌న్ తో వాట్సాప్‌లో చాట్ చేసేవారు. కాగా బాల‌చంద్ర‌న్ త‌న నీచ బుద్ధిని బ‌య‌ట పెట్టుకున్నాడు. ఆ బాలిక‌ను ఓ సారి క‌ల‌వాల‌ని ఉంద‌ని, దాంతో సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చ‌ని వాట్సాప్ చాట్‌లో పెట్టాడు. అయితే ఇవ‌త‌ల ఉంది ఎలాగూ పోలీస్ టీమే క‌దా, వారు స‌రే అని రిప్లై ఇచ్చారు. ఎలాగైనా బాల‌చంద్ర‌న్‌ను పట్టుకోవాల‌ని వారి ప్లాన్‌. అందులో అత‌ను ఇరుక్కున్నాడు. అత‌ను ఆ బాలిక ను క‌లుసుకోవ‌డానిక‌ని ఈస్ట్ లండ‌న్ నుంచి బ‌ర్మింగ్‌హామ్ వ‌చ్చాడు. ఓ హోట‌ల్‌లో రూం తీసుకుని బాలిక వాట్సాప్‌కు మెసేజ్ పెట్టాడు. దీంతో అల‌ర్ట్ అయిన సైబ‌ర్ పోలీసులు బాలచంద్ర‌న్‌ను చాలా తెలివిగా, రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అలా యూకే సైబ‌ర్ పోలీసుల స్టింగ్ ఆప‌రేష‌న్‌కు అత‌ను చిక్కాడు. దీంతో బాల‌చంద్ర‌న్‌ను పోలీసులు కోర్టుకు త‌ర‌లించ‌గా అత‌నికి 15 నెల‌ల జైలు శిక్ష ప‌డింది. అప్ప‌టికే అత‌న్ని జాబ్ నుంచి తొల‌గిస్తున్న‌ట్టు సిటీ బ్యాంక్ చెప్పింది. అవును, అత‌ను నిజంగా బాలిక‌తో చాట్ చేయ‌క‌పోయినా, అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పంప‌క‌పోయినా, అత‌ని ఆలోచ‌న అదే క‌దా. ఒక వేళ నిజంగానే ఎవ‌రైనా ప‌రిచ‌యం అయితే క‌చ్చితంగా లైంగిక దాడికి పాల్ప‌డేవాడు. అందుకనే అక్క‌డి పోలీసులు బాల‌చంద్ర‌న్‌ను అలా వ‌ల‌వేసి ప‌ట్టుకున్నారు. మ‌న దేశంలో కూడా ఇలాంటి వ్య‌వ‌స్థ ఉంటే బాగుంటుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top