బాలికను రేప్ నుంచి కాపాడిన చీమలు, ఎలాగంటే.?

నిర్మానుష్య ప్రదేశం, చుట్టూ ఎవ్వరు లేరు, 16 ఏళ్ళ అమ్మాయి పైన 29 ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేయబోయాడు, అడ్డు చెప్పడానికి ఎవ్వరు లేరు, మొరపెట్టుకున్నా కాపాడేవారు లేరు, ఇంక ఆ అమ్మాయి కూడా తన పని అయిపోయింది అనే భావించింది, ఆ దేవుడే చీమల రూపం లో వచ్చాడా అనేలా చీమలన్నీ అతగాడి పైన దాడి చేసాయి, దీంతో ఆ అమ్మాయి ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకుంది. వినడానికి నమ్మశక్యం కాకపోయినా జరిగింది ఇదే. ఈ సంఘటన ఇండోనేషియా లో జరిగింది.

వివరాల్లోకెళితే…

ఇండోనేషియాకు చెందిన 16 ఏళ్ల ఓ టీనేజ్ యువతి, 29 ఏళ్ల టోని ఐర్వాన్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. కొత్త ప్రదేశాలు చూడాలని టోనీ తో పాటు సాగింది, ఇద్దరు కొత్త ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేసారు. మార్గ మధ్యలో యువతి తో అసభ్యంగా ప్రవర్తించాడు టోని, బలాత్కారం చెయ్యాలని చూసాడు, కానీ అమ్మాయి తప్పించుకుంది, మళ్ళీ ఆమెను కనిపెట్టి కారు లో దూరంగా తీసుకుపోయి, పొదల్లో కి లాక్కొనిపోయాడు.

ఆ పొదల్లో అత్యాచారానికి ప్రయత్నించాడు, చుట్టు పక్కల ఎవ్వరు లేరు, అమ్మాయి ఎంతగా అరిచినా ఎవ్వరికీ వినిపియ్యదు, ఇంక తన పని అయిపోయింది అని ఆ అమ్మాయి కూడా భావించింది, ఇంతలో పక్కన చీమల పుట్టలో నుండి చీమలు సైన్యం గా వచ్చి అతడి పైన దాడి చేసాయి, ఒకే సారి అన్ని చీమలు అతడి పైన దాడి చెయ్యడం తో అతను నివ్వెర పోయాడు, ఆ అమ్మాయి అక్కడి నుండి తప్పించుకుంది, నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి టోని పైన కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు టోని ని అదుపులోకి తీసుకున్నారు, అతడు బలాత్కారం చేయబోయాడు కాబట్టి అతనికి 3 నుండి 15 వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, చీమలు తనను కాపాడతాయి అని ఎప్పుడు అనుకోలేదు, దేవుడి రూపం లో వచ్చి ఆ చీమలు టోని నుండి నన్ను కాపాడాయి, ఆ చీమలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని పేర్కొనింది ఆ అమ్మాయి.

పొదల్లోకి తీసుకెళ్లి

కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ఊరు శివార్లలో కారు ఆపాడు. కారును శుభ్రం చేయాలని.. కథలు చెప్పాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. పొదల్లోకి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే అక్కడున్న చెట్లు చేమల మధ్య చీమల దండు ఉంది. అవన్నీ ఒక్కసారిగా టోనిపై దాడికి దిగాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నల్లచీమలు అతడిని కుట్టడంతో…ఖంగు తినడం టోనీ వంతైంది. అదే అదునుగా భావించి టోని బారి నుంచి తప్పించుకున్న యువతి రక్షించాలని కేకలు పెడుతూ… పరగులు తీసింది.

చీమలు..?

పక్కనే ఉన్న ఆ అమ్మాయి పైన దాడి చెయ్యకుండా, కేవలం బలాత్కారం చెయ్యడానికి ప్రయత్నించిన టోని పైన మాత్రమే చీమలు ఎలా దాడి చేసాయి అనేది ఎవ్వరికీ అర్ధం కానీ ప్రశ్న. చీమల్ని పెంచుకోడం లో తప్పు లేదని సోషల్ మీడియా లో కొందరు నెటిజన్స్ అంటున్నారు, భావోద్వేగానికి లోనై ఆలా అంటున్నారేమో కానీ, చీమల్ని పెంచుకోడం ఏంటో.. ఏదైతేనేమి మొత్తనికీ ఒక ఆడపిల్ల మానం కాపాడాయి చీమలు. ఆ అమ్మాయి బ్రతికున్నంత వరకు ఆ చీమలకు రుణపడి ఉంటుంది.

 

Comments

comments

Share this post

scroll to top