అంగాంగ ప్రదర్శన చేస్తారు కాబట్టే హీరోయిన్స్ కి ఛాన్సులు వస్తాయి, హీరోయిన్స్ పైన సంచలనమైన కామెంట్స్ చేసిన బాలసుబ్రమణ్యం గారు.!

బాలసుబ్రమణ్యం గారు… తెలుగు లో పాటలు పాడే ప్రతి ఒక్కరికి ఈయనే ఇన్స్పిరేషన్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలా దాదాపు ఇండియాలో అన్ని భాషల్లో ఆయన పాటలు పాడారు, నేటి తరం యువతకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం, అభిమానం. వివాదాలకు దూరంగా ఉంటారు, ఇతరులని ఒక్క మాట కూడా అనరు. అలాంటి వ్యక్తి హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, పొలిటిషన్స్ పైన విరుచుకుపడ్డారంటే నమ్మగలమా.? కానీ ఇది నిజం. ఒక ఈవెంట్ లో బాలసుబ్రమణ్యం గారు సంచలనమైన కామెంట్స్ చేసారు.

బాష రాని హీరోయిన్స్, పొట్టి పొట్టి దుస్తులు.. :

బాలసుబ్రమణ్యం గారు హీరోయిన్స్ పైన కామెంట్స్ చేసారంటే నమ్మబుద్ధి కాదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ “తెలుగు లోనే తెలుగు హీరోయిన్స్ కరువయ్యారు, ఇతర బాషల వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మిగిలిన బాషలలో వాళ్ళ హీరోయిన్స్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనోళ్లు మాత్రం తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వట్లేదు, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు హీరోయిన్స్ కనుమరుగైపోయారు. స్టేజి పైన హీరోయిన్స్ వేసుకొనే పొట్టి పొట్టి దుస్తులు చూసినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంటుంది” అని బాలసుబ్రమణ్యం అన్నారు.

ఆలా చేస్తేనే హీరోలు, నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో.. :

“ఎక్సపోసింగ్ చేస్తూ నిర్మాతలని హీరోలని ఆకర్షించే హీరోయిన్స్ కె ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, పొట్టి దుస్తులు వేసుకుంటే కానీ ఛాన్సులు రావనుకుంటారో ఏమో, సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. వారి అంగాంగ ప్రదర్శన చూసి వారికి ఛాన్సులిస్తారు. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను భయపడను. ఏ హీరోయిన్‌కైనా కోపం వచ్చిన పర్లేదు, అయినా వారికి మన బాష రాదు కదా” అని అన్నారు ఆయన.

రాజకీయ నాయకులని కూడా వదల్లేదు.. :

బాలసుబ్రమణ్యం గారు అదే ఈవెంట్ లో రాజకీయనాయకుల పైన కూడా విరుచుకుపడ్డారు, “రాజకీయాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. 10, 15, 20 మర్డర్లు చేసి జైలుకుపోయి వచ్చిన వాళ్లే రాజకీయాల్లో కనిపిస్తారు. జైల్లో నుంచే గెలిచి సభల్లోకి వెళుతారు. వారు చేసిన దుర్మార్గాలకు శిక్ష పడితే ఐదారు ఏళ్లలో బయటకు వచ్చేస్తారు. ఎవరైతే బేడీలు వేస్తారో వారితోనే సలాంలు కొట్టించుకొంటారు” అని బాలసుబ్రమణ్యం తీవ్రంగా విమర్శించారు.

ఇన్నేళ్లల్లో ఎప్పుడూ లేనిదీ, ఆయన ఇప్పుడు ఇలా విమర్శలు చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది, ఆయనను సమర్ధించే వారు కొందరుంటే, ఆయన మాటలను వ్యతిరేకిస్తున్న వారు మరికొందరు. మొత్తానికి బాలసుబ్రమణ్యం గారి మాటల వల్ల మరోసారి రచ్చ మొదలైందని చెప్పొచ్చు.

 

Comments

comments

Share this post

scroll to top