వేలంపాటలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ వినాయకుడి లడ్డు.

ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డు వేలం పాట హోరాహోరీగా సాగింది . .1,116తో ప్రారంభమైన లడ్డూ వేలం పాట రూ.14.65 లక్షలకు కీసరకు చెందిన కందాడి స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బాలపూర్ లడ్డూ కోసం స్కైలాబ్ రెడ్డి, మన్నెం బల్వంత రెడ్డి, కొలన్ రామిరెడ్డి, రఘునాథచారీల మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరకు బాలాపూర్ గణేశ్ లడ్డూను   స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అక్కడే  డబ్బులు చెల్లించిన స్కైలాబ్ రెడ్డి లడ్డూను తీసుకున్నారు. త్వరలోనే ఆ ప్రాంత ప్రజలకు పంచుతానని చెప్పారు. గతేడాది ఈ లడ్డూ రూ.10.32 లక్షలకు మదన్ మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. అంటే ఈ యేడాదితో పోల్చితే ఈ యేడాది  లడ్డు ధర  4 లక్షల 33 వేలు ఎక్కువగా పలికింది.

Watch Video:( Total Laddu Auction Of Balapur):

Comments

comments

Share this post

scroll to top