ఒక పక్క “బాలకృష్ణ” బర్త్ డే..! మరోపక్క ఆయనేమో రోడ్డు పక్కన పడుకున్నాడు..! ఎందుకో తెలుసా..?

సినిమా వాళ్ళు కార్వాన్ వదలరని మనందరికీ తెలిసిందే. బయటకి వస్తే గొడుగు పట్టుకొని ఓ మనిషి ఉండల్ససిందే.  కానీ, మరి విదేశాల్లో షూటింగ్‌ అంటే… స్వరాష్ట్రంలో షూటింగ్‌ అంత సౌకర్యాలుండవు. కాకపోతే మన నటి నటులు ఆ సమయంలో సినిమా ముఖ్యం అనుకుంటారు.అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్‌ లాంటి ఆ తరం తారలు దర్శక, నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తూ, ఎండైనా, ఏమైనా రోడ్డు మీద చెట్ల కిందే కూర్చొని, షూటింగులు చేసిన సంగతులు కథలు, కథలుగా విన్నాం. మరి ఈ తరంలో బాలయ్య బాబు గారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తాజాగా పోర్చుగల్‌లో షూటింగ్‌లో హీరో అనే హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిగా గడ్డి మీద పడుకున్నారు బాలకృష్ణ గారు.

అంతే కాకుండా హైదరాబాద్ లో షూటింగ్ ఉన్న కూడా బాలకృష్ణ గారు మాక్ అప్ కోసం తప్ప మరోసారి కార్వాన్ వాడారు. బయట ఎండలోనే యూనిట్‌ అందరితో పాటు ఉంటారు. కష్టపడే తత్త్వం, సీను బాగా రావడం కోసం దేనికైనా తెగించే మనస్తత్వం, పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే తప్ప, నిర్మాత నెత్తి మీద గొంతెమ్మ కోరికల బండబరువు పెట్టని బాలకృష్ణ మంచితనం తాజాగా పోర్చుగల్లులో కూడా మరోసారి ఋజువైంది.

 

Comments

comments

Share this post

scroll to top